Home » Entertainment » Pooja Hegde Shared Gorgeouse Photos
Entertainment

Pooja Hegde : వావ్ పూజా హెగ్డే.. కైపెక్కించే అందాతో మంట పెడుతున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 17, 2022, 1:00 pm
Advertisement

Pooja Hegde: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు విరివిగా వ‌స్తున్నాయి. ఇటీవ‌ల మూడు సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయిన కూడా మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ డస్కీ అందాల భామ మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తుంది. ఇది వచ్చే వారంలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఇటీవల విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న `జనగణమన`(జేజీఎం) చిత్రంలో జాయిన్‌ అయ్యింది.

Advertisement

మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తోనూ ఓ భారీ సినిమా చేస్తుంది పూజా. ఇలా స్టార్‌ హీరోలందరితోనూ నటిస్తూ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తోను ఆకట్టుకుంటుంది. క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అంద‌రి మ‌న‌సులు దోచేస్తుంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన పిక్స్ చూసి కుర్రాళ్ల‌రు కంటిపై కునుకు లేకుండా పోయింది అమ్మ‌డి అందాల‌ను తెగ ఆస్వాదిస్తూ ఆ పిక్స్‌ని వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నువ్వా నేనా అనేలా ఈ రెండూ పిక్స్ ఉండటంతో అభిమానులు, నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆయా పిక్స్ ని వరుసగా షేర్‌ చేస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.

pooja hegde shared gorgeouse photos

Advertisement

Pooja Hegde : పూజా క్యూట్ లుక్స్..

ప్రస్తుతం అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డే కూడా ఒకరు. తనకు శాండిల్‌వుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు సమాచారం. పూజా హెగ్డే మాతృభాష కన్నడ అయినా ఇప్పటివరకు ఒక కన్నడ చిత్రంలో కూడా నటించలేదు. తమిళంలో హీరోయిన్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. పూజా ఈమధ్య నటించిన పాన్ ఇండియా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయినా కూడా అవకాశాలు అందుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనకు శాండిల్‌వుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. య‌ష్ సినిమాలో న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి