Pooja Hegde : స్టార్ హీరోకి పూజాహెగ్డే చెల్లెలుగానా.. ఏం మాట్లాడుతున్నారు?

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ బుట్ట‌బొమ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పూజాహెగ్డే.భాష‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. ఈ అమ్మ‌డు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని ప్లాన్ చేస్తుంది. హీరోయిన్‌గా, ఐటెం గార్ల్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అద‌ర‌గొట్టింది. ఇక ఇప్పుడు పూజా హెగ్డే హీరోకి చెల్లెలుగా కూడా న‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. చాలా ఏళ్ల తరువాత వెంకటేష్ హిందీలో ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ “కభి ఈద్ కభి దివాళి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ఫర్హద్ సంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ఏడాది ఆఖరులో విడుదల కాబోతోంది.అయితే, ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తుందట. వెంక‌టేశ్ పూజాహెగ్డే కు సోద‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తిట్టిపోస్తున్నారు. ప్ర‌స్తుతం వెంకీ చేస్తున్న తెలుగు సినిమా ఎఫ్ 3లో ఐటెం సాంగ్ చేస్తోంది పూజాహెగ్డే. ఇక ఇపుడు ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్‌గా బాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నారనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు కాని ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

pooja hegde sister to venkatesh
pooja hegde sister to venkatesh

Pooja Hegde : పూజా ఏంటిది?

టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుందని తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే హాజ‌రు కానున్నారట. ఈ ఏడాది కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ వేడు‌క‌లు ఈ నెల 17 నుంచి మొద‌లు కానున్నాయి. ఈ వేడుకలు అక్కడ ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా నటి పూజ హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పూజా హెగ్డే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన నటికి ఈ గౌరవం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement