Samantha : పూజా హెగ్డే పాట‌కు జోష్‌తో స్టెప్పులేసిన స‌మంత‌.. వైర‌ల్‌గా మారిన వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : పూజా హెగ్డే పాట‌కు జోష్‌తో స్టెప్పులేసిన స‌మంత‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

 Authored By sandeep | The Telugu News | Updated on :18 February 2022,10:00 am

Samantha : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విజ‌య్, పూజా న‌టించిన బీస్ట్ సినిమాలోని అర‌బిక్ కుత్తు అనే పాట ఓ ఊపు ఊపుతుంది. ఈ పాట‌కు సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు అద‌ర‌గొట్టే స్టైల్‌లో స్టెప్పులేస్తున్నారు.రీసెంట్‌గా పూజా హెగ్డే ఈ పాట‌కు మాల్దీవుల‌లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అల‌రించారు. క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టించి ర‌చ్చ చేసింది. తాజాగా స‌మంత కూడా ఇదే పాట‌కు త‌న‌దైన శైలిలో స్టెప్పులు వేసింది. ఈ పాటకు సమంత తనదైన స్టైల్లో డాన్స్ వేసి అద‌ర‌గొట్ట‌డంతో అంద‌రు అవాక్క‌వ్వ‌డ‌మే కాక ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత వీడియో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది.ఇక సమంత విడాకుల తర్వాత సూపర్ బిజీగా మారారు.

అందులో భాగంగా సమంత ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు మరోసారి వెబ్ సరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించి సరైనా లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నారట. అందులో భాగంగా సమంత తన వెబ్ సిరీస్ కోసం కఠోర శిక్షణ తీసుకుంటోందని తాజా సమాచారం. ఈ తాజా వెబ్ సిరీస్‌ను కూడా ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది.సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నారు. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేస్తున్నారు.

Samantha : స‌మంత స్టెప్స్ మాములుగా లేవు..

pooja hegde Song to Dance Samantha Video

pooja hegde Song to Dance Samantha Video

కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు యశోద అనే పేరును ఖరారు చేసింది చిత్రబృందం. స‌మంత న‌టించిన శాకుతలం చిత్రం కూడా విడుద‌ల‌కి సిద్ధ‌గా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది