Poonam Kaur : గీసిన గీత ఇంకా నేను దాటలేదు స్టేజిపై ఎమోషనల్ ఏడ్చిన పూనమ్ కౌర్ వీడియో వైరల్..!!

Poonam Kaur : తెలంగాణ గవర్నర్ తమిళసై ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సినీనటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో స్టేజ్ పై కన్నీరు పెట్టుకుంది. తాను తెలంగాణలోనే పుట్టడం జరిగిందని… కానీ తన మతం వల్ల.. పంజాబీ అమ్మాయిని అని వెలివేసే ప్రయత్నాలు చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ సాధించి కొంతమంది ఆడవాళ్లను ప్రతినిధులుగా చూపిస్తున్నారు. మిగతా ఆడవాళ్లకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. వాలే సర్వస్వం అన్నట్లు…ఆ ఆడవాళ్లను ప్రొజెక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ ఫెవర్ లేని చాలా మంది ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు.  ఇదే విషయాన్ని గవర్నర్ తమిళ్ సై కూడా తెలియజేయడం జరిగింది.

Poonam Kaur Emotional Words At International Womens Day Celebrations

ప్రత్యేక తెలంగాణ… తెలంగాణ బిడ్డల కోసమే కదా తీసుకొచ్చారు. అలా అయితే మీ బిడ్డలే పైకి రావాలని వ్యవహరిస్తే ఎలా అని పూనం ప్రశ్నించారు. తెలంగాణలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. అలాంటప్పుడు నన్ను పంజాబీ అమ్మాయి అని ఎలా అంటారు. మాది సిక్కు మతం కారణంగా ఆ విధంగా వెలివేయటం మీడియాకు కూడా సమంజసం కాదు. నేను మా మతానికి సంబంధించిన పండగలు మిస్ అయ్యి ఉండొచ్చేమో గాని తెలంగాణ బోనాలు పండుగ ఎప్పుడు మిస్ కాలేదు. చేనేత ఇంకా చాలా విషయాలపై పోరాడాలని అనుకున్నాను. కానీ నన్ను పైకి రానవటం లేదు. మీ బిడ్డలే తెలంగాణ బిడ్డల… మిగతావాళ్లు కాదా అంటూ పూనం ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రీతి, దీశ వంటి ఘటనలు ఎక్కువైపోయాయి.

తెలంగాణలో ఆడవాళ్లకు భద్రత లేదు. అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులకు కడపుకోత మిగుల్చుతుందని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అంతకు ముందు ఆ మగాడ్ని చంపేయండంటూ సంచలన కామెంట్స్ చేసింది పూనమ్. భరించలేని పరిస్థితి వస్తే కత్తిపట్టడంలో తప్పులేదని గురుగోవింద్‌ చెప్పిన సూక్తులను ఉటంకిస్తూ.. ‘వేధించే మగాళ్లు సింహాలైతే.. మనం గర్జించే సివంగులం, ఆడపులులం.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఆడవాళ్లకు గీత గీసిన తరహా విధంగా సమాజం ఉందని హిందీలో కవిత్వం రాసుకొచ్చి వినిపించారు. తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ ఏడవటం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago