Hyper Aadi : హైపర్ ఆది అంతలా హింసించాడా?.. పూర్ణ అందుకే ఢీ షో మానేసిందా?

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 31, 2022, 8:00 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇక తాను వేసే కొన్ని స్కిట్లు అడల్ట్ స్కిట్లలానే ఉంటాయి. తనకు మ్యాటర్ లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ స్కిట్లు వేస్తుంటాడు. అదే సమయంలో హగ్గులు, కిస్సుల కోసం ఆరాట పడుతున్నవాడిగానూ స్కిట్లలో నటిస్తుంటాడు. ఈ వ్యవహారం ఢీ షోలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జడ్జ్‌లుగా ఉన్న ప్రియమణి, పూర్ణ వంటి వారిని హగ్గులివ్వమంటూ ఆది ఎన్నో సార్లు అడిగాడు. స్టేజ్ మీదే హగ్గులు తీసుకున్నాడు. కానీ కిస్సులు కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.

అలా ఆది ప్రియమణి ట్రాక్ కొన్నాళ్లు బాగానే అనిపించినా.. ఆ తరువాత వెగటు పుట్టించింది. బావ అంటూ ప్రియమణి పిలవడం, ప్రియా అంటూ హైపర్ ఆది రెచ్చిపోవడం అందరికీ తెలిసిందే. ఇక పూర్ణతోనూ అవే పరాచకాలు ఆడేవాడు. పూర్ణని హగ్గులు, కిస్సులు ఇవ్వమంటూ నానా హంగామా చేసేవారు. అందులో ఆది కూడా ముందుండే వాడు. అయితే ఇప్పుడు పూర్ణ ఆ షోను మానేసింది. ఢీ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిందా? లేదా పంపించేశారా? అన్నది క్లారిటీ అయితే లేదు.

Poorna Out From Dhee Because of Hyper Aadi Torture

Poorna Out From Dhee Because of Hyper Aadi Torture

కానీ తాజాగా పూర్ణ తన నోటి నుంచే ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇందులో పూర్ణ కావాలనే అలా ఉంది. లేదా ప్రాస కోసం డైరెక్షన్ టీం ఆ డైలాగ్స్ రాసిందా? అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు అవి హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పూర్ణ వచ్చింది. ఇంద్రజ స్థానంలో పూర్ణను తీసుకొచ్చారు. సుధీర్ స్థానంలో రష్మీని తీసుకొచ్చారు. ఇక షో కొత్తగా ఉండబోతోందన్నట్టు చూపించారు. అయితే ఇందులో పూర్ణ కూడా రెచ్చిపోయింది. ఇక ఆది కాస్త ఓవర్ చేయడంతో అసలు విషయం చెప్పింది.

శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ ఆది తీరు మారలేదట. ఇక్కడ కూడా హగ్గులు అని అడుగుతున్నాడట. ఢీ షోలో హగ్గులు అని చంపుతున్నారనే ఇక్కడకు వస్తే.. ఇక్కడ కూడా వదలవా? అంటూ పూర్ణ అనేసింది. దీంతో షో మానేయడానికి ఆది పెట్టిన హింస అని, హగ్గుల బాధ అని పూర్ణ చెప్పకనే చెప్పేసిందన్న మాట.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp