Poorna : పెళ్లి ఫొటోలు షేర్ చేసిన పూర్ణ‌.. ముద్ద‌ల‌తో మంచేస్తున్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : పెళ్లి ఫొటోలు షేర్ చేసిన పూర్ణ‌.. ముద్ద‌ల‌తో మంచేస్తున్నాడుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 October 2022,4:00 pm

Poorna : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా న‌టించి అల‌రించిన పూర్ణ ఇప్పుడు బుల్లితెర‌పై సంద‌డి చేస్తుంది. అడ‌పాద‌డ‌పా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది. కెరీర్ పరంగా ఆ మధ్య కొంత గ్యాప్‌ వచ్చినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది పూర్ణ. ఓ మోస్తారు నుంచి, చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తుంది. సౌత్‌లో చాలా బిజీగా ఉంది పూర్ణ. ఇటీవల తెలుగులో `అఖండ`, `దృశ్యం2`,`తీస్‌ మార్‌ ఖాన్‌` చిత్రాలతో మెప్పించింది. సినిమాలతోపాటు `ఢీ` వంటి షోకి జడ్జ్ గా చేస్తుంది పూర్ణ. అయితే దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న పెళ్లి ఫోటోల‌ను షేర్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది పూర్ణ .

ఈ భామ ఆ మధ్య దుబాయ్‌ బేస్డ్ ఇండియన్‌ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీ( ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫోటోలను పంచుకుని సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చింది. మే నెలలో పూర్ణ ఎంగేజ్మెంట్ జరగాక కాబోయే వరుడుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అలా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక నవంబర్ లో పూర్ణ వివాహం ఉంటుందనే వార్తలు బాగా వైరల్ గా మారాయి. ఇటీవల ఒక మీడియాతో స్పందించిన పూర్ణ జూన్ 12వ తారీకున తమ వివాహం జరిగిందంటూ ట్విస్ట్ ఇచ్చింది పూర్ణ.

Poorna shared wedding photos on Instagram

Poorna shared wedding photos on Instagram

Poorna : క్యూట్ పిక్స్..!

ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌న అంద‌రు దుబాయ్ రాలేక‌పోయారు అని పూర్ణ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అల‌రించే ప్ర‌య‌త్నం చేసింది. పూర్ణ పెళ్లి ఫోటోలు విషయానికి వస్తే పట్టుచీరలో నిండా నగలతో బుట్ట బొమ్మల కనిపిస్తోంది. పెళ్లికూతురు దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది.తన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అసూయ పుట్టేలా తన అందంతో పూర్ణ అక్కడ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ముస్లిం సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లుగా ఈ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతోంది. త్వ‌ర‌లో కేర‌ళ‌లో పూర్ణ త‌న రిసెప్ష‌న్ జ‌రుపుకోనుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ఎవ‌రెవ‌ర‌ని పిలుస్తుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది