Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !

 Authored By sudheer | The Telugu News | Updated on :30 January 2026,9:31 am

Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు, ఈరోజు ఒక్కసారిగా ‘ఆల్ టైమ్ హై’ని తాకాయి. సాధారణంగా వందల్లో పెరిగే ధరలు, ఈసారి వేలల్లో పెరగడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. నియోగదారులు ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఈ భారీ పెరుగుదల పసిడి ప్రియులకు కరెంట్ షాక్ కొట్టినంత పని చేసింది.

Today Gold Price on January 30th 2026 పసిడి ప్రియులకు భారీ షాక్ఏకంగా రూ11 వేలకు పైగా పెరిగిన బంగారంఈరోజు ఎంతంటే

Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !

హైదరాబాద్ మార్కెట్ గణాంకాల ప్రకారం..

ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.11,770 పెరిగి, రూ.1,78,850 వద్దకు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.10,800 మేర ఎగబాకి రూ.1,63,950 వద్ద నిలిచింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న సమయంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి, యుద్ధ మేఘాలు, డాలర్ విలువలో మార్పులు మరియు అమెరికా విధిస్తున్న సుంకాలు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి సెగను రాజేశాయి. ఈ పరిణామాలన్నీ కలిసి దేశీయంగా ధరలు చుక్కలనంటడానికి కారణమయ్యాయి.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది