Anushka Shetty : అనుష్క‌కు వార్నింగ్ ఇచ్చిన ప్ర‌భాస్.. ఎందుకో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: September 18, 2022, 2:30 pm

Anushka Shetty : టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ జంట ప్ర‌భాస్- అనుష్క‌. వీరు వెండితెర‌పై చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ప్రభాస్- అనుష్క వెండితెర‌పై సంద‌డి చేయ‌గా, రీల్ లైఫ్‌లో కూడా వీరు జంట‌గా క‌నిపిస్తే చూడాల‌ని అంద‌రు అనుకుంటున్నారు. ప్ర‌భాస్ అనుష్క క‌లిసి మిర్చి, బాహుబ‌లి సినిమాల‌లో న‌టించారు. బాహుబ‌లి సినిమా షూటింగ్ తర‌వాత ప్ర‌మోష‌న్స్ లో ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు చూపించుకునే కేరింగ్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. . ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.

చేతి నిండా బిగ్ ప్రాజెక్టులతో ఉన్నాడు. ఈ సినిమాల త‌ర్వాత పెళ్లి చేసుకుంటాడా అనే అనుమానం క‌లుగుతుంది. ఇదిలా ఉంటే కొన్నాళ్ల నుండి ప్ర‌భాస్, అనుష్క బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అనుష్క ప్రభాస్ మాత్రం చాలా హుందాగా బిహేవ్ చేస్తారు. ప్రొడ్యూసర్ తో కానీ డైరెక్టర్లతో కానీ వాళ్ళ సినిమాకు సంబంధించి ఏ ఇబ్బందులకు గురి చేయరు. అయితే అనుష్క ఒక సినిమా విష‌యంలో స్క్రిప్ట్ గురించి చెప్పగా ప్రభాస్ నో అంటు రిజెక్ట్ చేశారట. కానీ అనుష్కకు నచ్చడంతో ఆమె సైన్ చేసి సినిమాలో నటించారు. అఫ్ కోర్స్ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా మరేదో కాదు “వేదం”. అప్ప‌టివ‌ర‌కు స్టార్ స్టేటస్ ఉన్న అనుష్క అందులో వ్య‌భిచారిగా క‌నిపించే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు.

prabahs warns to Anushka Shetty

prabahs warns to Anushka Shetty

Anushka Shetty : వ‌ద్ద‌న్నా కూడా..

స్టార్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క అలా క‌నిపిస్తే మైనస్ అవుతుంది అని అంతా భావించారు. ఇదే క్రమంలో ప్రభాస్ కూడా స్క్రిప్ట్ రిజెక్ట్ చేయమని చెప్పారట. కానీ అనుష్క మాత్రం కథ నచ్చడంతో ముందుకెళ్ళింది. ఆమెను ఎవరు వ్యభిచారిగా చూడలేదు. ఆ పాత్రలో వాళ్ళు పడిన బాధను మనకు తెలియజేసే అమ్మాయిలానే చూసారు. ఆ పాత్ర చూసిన 60 ఏళ్ల ముసలావిడ “హగ్ చేసుకుని బాగా చేశావమ్మా” అంటూ పొగిడేసరని ఆ సందర్భాన్ని అనుష్క ఇప్పటికీ మర్చిపోలేను ఇంటర్వ్యూలో చెప్పుకురావటం గమనార్హం. చాలా రోజుల త‌ర్వాత అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉంది. ఈ ఇద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రానుంద‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp