Adipurush : కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చిన డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్ విషయంలో సూపర్ గుడ్ న్యూస్!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 October 2022,8:30 pm

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి ప్రభాస్ కు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. దాంతోపాటు అతడి పారితోషికం కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమా సక్సెస్ అతడి కెరీర్ కు అత్యంత కీలకంగా మారనుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఆది పురుష్ టీజర్ కు నెగటివ్ కామెంట్స్ రావడం ప్రభాస్ ను వణికిస్తున్నట్లు సమాచారం.

ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ కు నచ్చచెప్పుతున్నప్పటికీ మరో సాహసం చేసి నెగటివ్ రిజల్ట్ వైపు అడుగులు వేయకూడదు అన్న నిర్ణయంలో ప్రభాస్ ఉన్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలా ఉందో అలా విడుదల చేయడం ఒక మార్గం అయితే ఈ సినిమాలో చాలావరకు విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు కరెక్షన్లు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా ప్రభాస్ కు వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఆడియన్స్ ఫీలింగుకు తగ్గట్లు మార్చాలంటే చాలా సమయం పడుతుంది.

Prabhas adipurush movie plan changed

Prabhas adipurush movie plan changed

కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి బదులుగా సమ్మర్ కు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై ప్రభాస్ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీ బడ్జెట్ ఖర్చుపెట్టిన పరిస్థితులలో మళ్ళీ గ్రాఫిక్ వర్క్స్ విషయాలలో మార్పులు చేయాలంటే ఖర్చు కోట్ల రూపాయలు అవుతాయి. కాబట్టి అది ఎంతవరకు సాధ్యం అన్న విషయంలో కూడా చర్చలు జరుగుతున్నట్టు టాక్. ఇది అయితే ఈ సినిమా త్రీడి వర్షన్ ట్రైలర్ చూసినవారు గ్రాఫిక్స్ బాగున్నాయి అని చెబుతూ ఉండటంతో కొంతవరకు ప్రభాస్ కు మంచిగా ఉన్నట్లే ఉంది. ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రభాస్ ఇంకా ఆందోళనలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రభాస్ లైఫ్ ఎలా మారుతుందో వేచి చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి