prabhas along with kamal haasan wow in theaters
పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడలేదన్న సంగతి తెలిసిందే. 2018లో బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహూ, రాధేశ్యామ్ రెండు కూడా పరాజయాలు పాలయ్యాయి. కాగా ఫస్ట్ టైం తెలుగు దర్శకుడు తో కాకుండా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన “ఆదిపురుష్”తో జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంజనాలు ఉన్నాయి.
prabhas along with kamal haasan wow in theaters
ఇక వీటితోపాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టుకే సినిమాలు చేస్తున్నాడు. అయితే వీటిలో “ప్రాజెక్టు కె”లో బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన భారీ తారాగణం నటిస్తోంది. అమితాబ్, దీపికా పదుకొనే, దిశాపటాని ఇంకా చాలామంది నటీనటులు కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రకి సంబంధించి సరికొత్త న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేమిటంటే యూనివర్సల్ యాక్టర్ కమలహాసన్ నెగిటివ్ పాత్రలో ప్రభాస్ తో .. “ప్రాజెక్ట్ కె”లో తలపడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దాదాపు 30 నిమిషాల పాటు కమల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఓ రేంజ్ లో డైరెక్టర్ నాగ అశ్విన్ తీర్చిదిద్దినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే కనుక నిజమైతే థియేటర్లలో పండగే అని సినిమా ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి 75% షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాత స్వప్న దత్ ఇటీవల క్లారిటీ ఇవ్వటం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ కూడా ఇవ్వటానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.