Prabhas : ప్రభాస్ సినిమా ఢీల్ అంటే అంతేమరి.. అన్నీ ఇండస్ట్రీ రికార్డ్స్ చెరిగిపోవాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ సినిమా ఢీల్ అంటే అంతేమరి.. అన్నీ ఇండస్ట్రీ రికార్డ్స్ చెరిగిపోవాల్సిందే..!

 Authored By govind | The Telugu News | Updated on :4 March 2021,3:36 pm

Prabhas : ప్రభాస్ నటించే సినిమాలకి బిజినెస్ పరంగా భారీ ఢీల్ కుదురుతోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ కి అన్ని సినిమా ఇండస్ట్రీలలో విపరీతంగా క్రేజ్ నెలకొంది. అంతేకాదు చైనా, జపాన్ లలో కూడా ప్రభాస్ సినిమాలు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రభాస్ సినిమాలకి అన్నీ రకాలుగా మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతోంది.

prabhas deal is that all industries records will break

prabhas-deal-is-that-all-industries-records-will-break

అయితే ఇప్పటి వరకు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఏ స్టార్ హీరో సినిమాకి రాని భారీ ఢీల్ సలార్ సినిమాకి వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న ప్రభాస్ అండ్ పాన్ ఇండియన్ రేంజ్ లో కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సలార్ రూపొందుతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Prabhas : ప్రభాస్ సినిమాకి మాత్రమే ఇంత ఆఫర్ రావడం గొప్ప విషయం.

హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే ప్రముఖ స్ట్రీంగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజయ్యాక సలార్ సినిమాని అన్నీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసుకునేందుకే ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు తాజా సమాచారం. ఇది నిజమైతే మాత్రం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క ప్రభాస్ సినిమాకి మాత్రమే ఇంత ఆఫర్ రావడం గొప్ప విషయం.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది