Prabhas : వామ్మో ఇటలీలో ప్రభాస్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతి పోవాల్సిందే
ప్రధానాంశాలు:
Prabhas : వామ్మో ఇటలీలో ప్రభాస్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతి పోవాల్సిందే
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, సలార్, కల్కి 2898 AD వంటి చిత్రాలతో వరుసగా బ్లాక్‌బస్టర్లు అందించి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. నటనలో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ప్రభాస్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి ఎన్నో రకాల పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ వాటిపై ప్రభాస్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు.

Prabhas : వామ్మో ఇటలీలో ప్రభాస్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతి పోవాల్సిందే
Prabhas : ఇండియా లోనే కాదు ప్రభాస్ కు ఇటలీ లో కూడా వందల కోట్ల ఆస్తులు
తాజాగా ప్రభాస్ ఇటలీలో రూ.40 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశారనే వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆయన ఆ విల్లాలోని కొంత భాగాన్ని పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పాటు ప్రభాస్‌కి ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.250 కోట్లు,అని అందులో ఫామ్‌హౌస్, కార్ల కలెక్షన్లు, విదేశాల్లోని ఆస్తులు వంటివి ఉన్నాయని అంటున్నారు. అయితే ఇటలీ విల్లా గురించి ప్రభాస్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.
ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రభాస్ క్రేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ గురించి చిన్న సమాచారం కూడా వైరల్ కావడమే ఇందుకు నిదర్శనం.