prabhas : ద‌టీజ్ ప్ర‌భాస్.. వ‌యానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

prabhas : ద‌టీజ్ ప్ర‌భాస్.. వ‌యానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం

prabhas : కేరళలోని వయనాడ్ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్ర‌యులు అయిన విష‌యం తెలిసిందే. ఆ భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయిన‌ట్టు తెలుస్తుండ‌గా, వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  prabhas : ద‌టీజ్ ప్ర‌భాస్.. వ‌యానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం

prabhas : కేరళలోని వయనాడ్ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్ర‌యులు అయిన విష‌యం తెలిసిందే. ఆ భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయిన‌ట్టు తెలుస్తుండ‌గా, వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

prabhas మంచి మనస్సు..

కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపం సృష్టించిన విషాదం ఎన్నో జీవితాలను చిద్రం చేసింది. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది. అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని సెల‌బ్రిటీలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

prabhas ద‌టీజ్ ప్ర‌భాస్ వ‌యానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ2 కోట్ల విరాళం

prabhas : ద‌టీజ్ ప్ర‌భాస్.. వ‌యానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం

చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ కూడా తమ వంతుగా సహాయం అందించారు. అల్లు అర్జున్ వయనాడ్ బాధిత కుటుంబాలకు 25 లక్షలు విరాళం ఇవ్వగా, చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు.ఇక వీరందరికంటే ప్రభాస్ దాతృత్వం లో తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించారు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గొప్ప మనసును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ప్ర‌భాస్ మంచి మ‌న‌సుకి ఇంత క‌న్నా గొప్ప ఉదాహ‌ర‌ణ ఏం కావాల‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది