Prabhas Raja Saab Sequel : సీక్వెల్స్ హీరో ప్రభాస్.. రాజా సాబ్‌కి కూడా పార్ట్ 2 ఉంటుందా ?
ప్రధానాంశాలు:
Prabhas Raja Saab Sequel : సీక్వెల్స్ హీరో ప్రభాస్.. రాజా సాబ్‌కి కూడా పార్ట్ 2 ఉంటుందా?
Prabhas Raja Saab Sequel : టాలీవుడ్ Tollywood హీరో నుండి పాన్ ఇండియా Pan India Star Prabhas స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ మంచి జోష్ మీదున్నాడు. ఆయన ఇటీవల చేసిన చిత్రాలు మంచి విజయాలని అందించాయి. సలార్’ సక్సెస్ ప్రభాస్ కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘కల్కి 2898 AD’ సినిమా కూడా 2024 సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్- మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా Raja Saab Sequel చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది.

Prabhas Raja Saab Sequel : సీక్వెల్స్ హీరో ప్రభాస్.. రాజా సాబ్‌కి కూడా పార్ట్ 2 ఉంటుందా ?
Prabhas Raja Saab Sequel వరుస సీక్వెల్స్..
హరర్ కామెడీ ది రాజా సాబ్ చిత్రం సినిమా Raja Saab Sequel ప్రారంభమైనప్పటి నుంచి అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తొలుత ఏప్రిల్ 10 విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్, ఇప్పుడు మరోసారి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తైనప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా ఉన్నాయట.
ప్రభాస్ కెరీర్‌లో హారర్ కామెడీ జానర్ లో ఇదే ఫస్ట్ మూవీ కావడం, భారీ వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో మారుతి కూడా క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉంటుందట. క్లైయిమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో బాహుబలి , సలార్ చిత్రాలకి పార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు కల్కికి కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాజాసాబ్ కూడా చేస్తున్నాడని తెలియడంతో ఇన్ని సీక్వెల్స్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కడే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.