Kalki 2898 VS Pushpa 2 : బడా సినిమాలపై ఎలక్షన్స్ ఎఫెక్ట్.. పుష్ప2, కల్కి చిత్రాలు పోటీ పడనున్నాయా లేదా..!
ప్రధానాంశాలు:
Kalki 2898 VS Pushpa 2 : బడా సినిమాలపై ఎలక్షన్స్ ఎఫెక్ట్.. పుష్ప2, కల్కి చిత్రాలు పోటీ పడనున్నాయా లేదా..!
Kalki 2898 VS Pushpa 2 : ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి పెరిగింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగులో వచ్చిన చాలా చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ బడా సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం సంక్రాంతి బరిలో జనవరి 12న గుంటూరు కారం వచ్చింది. ఈ మూవీ కాస్త కలవరపాటుకి గురి చేసింది. ఇక ఈ మూవీ హిట్, ప్లాఫ్ సంగతి పక్కన పెడితే తాజాగా ఈగల్, ఊరిపేరు భైరవ కోన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరు కూడా కల్కి, పుష్ప 2 చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి విషయానికి వస్తే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్సన ల్ పిక్చర్ మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
అయితే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనునన్న నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అలాగే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహించనున్న నేపథ్యంలో కల్కి మూవీ విడుదల వాయిదా పడడం ఆసక్తికరంగా మారింది. మేలో రావల్సిన కల్కి చిత్రం ఆగస్టు 15న విడుదల చేయాలని నెటిజన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు. ఇటీవల ప్రభాస్ అభిమాని ఒకరిని అల్లు అర్జున్ అభిమానులు దాడి చేసిన ఘటన వైరల్ కావడంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కల్కి సినిమా దాదాపు వాయిదా పడడం ఖాయమే అని తెలుస్తుండగా, ఒకవేళ పుష్ప రిలీజ్ సమయానికి ఇద్దరి మధ్య పొటీ ఉంటే మాత్రం అరాచకమే అని చెప్పాలి.
మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమ్మర్ సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. టిల్లు స్క్వేర్ ఈ నెల 29వ తేదీన ఫ్యామిలీ స్టార్,ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్నాయి. అంటే ఈ సినిమాలు ఎలక్షన్స్ ముందు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి పెద్ద సమస్య లేదు. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నికల తర్వాత మే 17వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దేవర చిత్రం వాయిదా పడిన నేపథ్యంలో కల్కి కూడా వాయిదా పడితే మరిన్ని చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు.