Bunny Vasu : కిమ్స్ లో బన్నీ వాసు.. శ్రీతేజ్ ని ఫారిన్ కి తీసుకెళ్తున్నారా..?
ప్రధానాంశాలు:
Bunny Vasu : కిమ్స్ లో బన్నీ వాసు.. శ్రీతేజ్ ని ఫారిన్ కి తీసుకెళ్తున్నారా..?
Bunny Vasu : పుష్ప 2 తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ తేజ్ ని కిమ్స్ లో చికిత్స చేయిస్తున్నారు. ఐతే శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా శ్రీతేజ్ ని పరామర్శించేందుకు నిర్మాత బన్నీ వాసు హాస్పిటల్ కి వెళ్లారు.
శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతుండడంతో బన్నీ వాసు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐతే శ్రీ తేజ్ కి ఇంకా మెరుగైన వైద్యం కోసం ఫారిన్ తీసుకోని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. శ్రీతేజ్ హెల్త్ ఇంకా వారి ఫ్యామిలీ కోసం 2 కోట్ల రూపాయల ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే హాస్పిటల్ లో శ్రీతేజ్ ట్రీట్మెంట్ మొత్తం అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు.
బన్నీ వాసు ఇక పూర్తిగా శ్రీ తేజ్ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి సపోర్ట్ గా బన్నీ వాసు ఎప్పుడు అతని పక్కనే ఉంటూ వచ్చాడు. ఐతే శ్రీతేజ్ కోలుకునే వరకు అతని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడు బన్నీ వాసు.