
Prabhas : పెళ్లి పక్కన పెట్టి వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి సినిమాలపైనే దృష్టి పెట్టాడు.వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ఉండగా,అతని సినిమాలు 300 నుంచి 600 కోట్ల వరకు బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. సినిమా సినిమాకి ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అఫీషియల్ గా అయితే 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో రెండు సీక్వెల్స్ కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.హను రాఘపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2’. ఇక నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ చిత్రాలు చేయాల్సి ఉంది.
వీటిలో కొన్ని షూటింగ్ దశలో ఉంటే.. కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి.వీటిని పూర్తి చేసేసరికి కనీసం 3 ఏళ్ళు పట్టొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న 5 సినిమాలలో కనీసం మూడు చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. రాజా సాబ్ , ఓ వైపు ఫౌజీ , మరో వైపు స్పిరిట్ . ఈ మూడు సినిమాలకు డిఫరెంట్ లుక్స్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి మూడు సినిమాలను ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేయగలడు అని అంతా ఆలోచిస్తున్నారు. బహుశా ముందు వేరే నటి నటులతో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ప్రభాస్ తో షూట్ చేసే అవకాశం ఉందని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
Prabhas : పెళ్లి పక్కన పెట్టి వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!
స్పిరిట్ కంప్లీట్ అయితే వెంటనే సలార్-2, కల్కి-2 చిత్రాలు వెయిటింగ్ లో ఉన్నాయి. మూడు సినిమాల కోసం హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ కి ఏకంగా 600 కోట్లు రెమ్యునరేషన్ గా చెల్లిస్తున్నారంట. అంటే ఒక్కో సినిమాకి 200 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లలో ఒకడిగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 నుంచి 200 కోట్ల మధ్యలోనే ఛార్జ్ చేస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో చేయబోయే మూడు సినిమాలు 2026, 2027, 2028 లో వస్తాయని కూడా కన్ఫర్మ్ చేశారు.ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న ఐదు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా 4 ఏళ్ళల్లోనే ఫినిష్ అవుతాయని తెలుస్తోంది. ఇలా ఫినిష్ చేయాలంటే గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ఫినిష్ చేసేలానే కనిపిస్తున్నాడు.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.