Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు కొద్దిసేపు ఉదయాన్నే సూర్యకాంతిలో నిలబడితే విటమిన్ డీ లోపం అనేది తీరుతుంది. అలాగే కొన్ని ఆహారాలలో కూడా విటమిన్ డీ అనేది ఉంటుంది. సాధారణంగా విటమిన్ డీ అనేది పాలు మరియు చేపలలో పుష్కలంగా ఉంటుంది. మరి శాకాహారుల పరిస్థితి ఏమిటి అని అనుమానం కూడా ఉంటుంది కదా. వారికోసం విటమిన్ డీ ఉన్నటువంటి కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అయితే విటమిన్ డీ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
విటమిన్ డీ లోపం ఉన్నవారిలో ముఖ్యంగా కండరాల బలహీనత, తిమ్మిరి మరియు కాళ్లలో, చేతులలో జలదరింపులు కూడా వస్తాయి. అలాగే ఎముకలలో నొప్పి మరియు తొందరగా అలిసిపోయినట్లు అనిపించడం, డిప్రెషన్ గా అనిపించడం లేక మెట్లు ఎక్కలేకపోవటం లేక కూర్చున్నప్పుడు లేవలేక పోవటం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే వీరు నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడతారు. అలాగే విటమిన్ డీ లోపం వలన వెంట్రుకలు కూడా చిట్లిపోతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని ఆహారాలను చూపిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆహారాలలో ముఖ్యంగా పుట్టగొడుగులు విటమిన్ డీ కి ముఖ్య మూలం. అయితే ఈ పుట్ట గొడుగులో ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్ డీ2 పుష్కలంగా ఉంటుంది. వాటిని సూప్, సలాడ్ లేక కూరగాయలలో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే విటమిన్ డీ కి ఇంకొక పోషకమైన కూరలలో పాలకూర కూడా ఒకటి. ఈ పాలకూర లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం మరియు ఇనుము లాంటి ప్రత్యేకమైన పోషకాల ను కలిగి ఉంటుంది. అలాగే ఈ పాలకూరను సలాడ్ లేక పకోడీల కూడా చేసుకొని తీసుకోవచ్చు.
విటమిన్ డీ పుష్కలంగా దొరికే మరొక ఆకుకూర కాలే. ఇది ఒక అద్భుతమైన ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ ఆకుకూరలో విటమిన్ డీ తో పాటుగా ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాలేను సలాడ్ లో ఉడికించి లేక పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాక బ్రోకలీలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బ్రోకలీ ఆవిరి మీద ఉడికించి లేక సలాడ్ లో కలుపుకొని కూడా తినొచ్చు. అలాగే ఆరెంజ్ అనేది విటమిన్ సి కి ప్రసిద్ధి చెందింది. ఈ పండు సిట్రస్ జాతికి చెందినది. దీనిలో విటమిన్ డీ కూడా ఉంటుంది. ఈ ఆరేంజ్ జ్యూస్ ను తీసుకోవటం వలన విటమిన్ డీ మనకు లభించడమే కాకుండా శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు ప్రతిరోజు గుడ్లు తిన్న కూడా విటమిన్ డీ లోపం అనేది పోతుంది. అయితే రెండు కోడిగుడ్లలో సగటుగా 8.2 ఎంసిజి విటమిన్ డీ ఉంది అని పరిశోధనలో తేలింది. అలాగే విటమిన్ డీ సిఫారస్ చేసినటువంటి ఆహారంలో 82% అని వైద్య నిపుణులు చెబుతున్నారు
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
This website uses cookies.