Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. ఇటీవల ఆది పురుష సినిమాలో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్రాజెక్ట్ కి ఏ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టుకే సినిమా క్యాస్ట్ సబ్జెక్టు బడ్జెట్ ప్రతి విషయం మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా అరుదైన మైలురాయి అందుకుంది. అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంటుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023కి ప్రాజెక్ట్ కే కి ఆహ్వానం లభించింది.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే నిలిచింది. ఈ వరల్డ్ సినిమా వేదిక సాక్షిగా ప్రాజెక్ట్ కే టీమ్ ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ గ్లిమ్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ పై ప్రేక్షకులలో సస్పెన్స్ నెలకొంది. అసలు కే అంటే ఏంటి అని సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ ప్రాజెక్టు కే సినిమా టైటిల్ అండ్ టీజర్ నౌ విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ జులై 20 నుండి 23 వరకు జరగనుంది.
మొదటి రోజే అనగా జులై 20న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. కాబట్టి ఇండియాస్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ చూసేందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ ప్రోమోలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం. శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అవుతున్నారు .కాగా ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తలకెక్కింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.