Pragathi : ప్రగతిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఇదేం ఎనర్జీరా బాబు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 9, 2022, 11:00 am

Pragathi : నటి ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేస్తోన్న వ్యాయామాలు, చేస్తోన్నడ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటుందా? అనే అనుమానాలు కూడా జనాలకు వస్తుంటుంది. ఆమె చేసే వర్కవుట్లు చూసి అందరూ షాక్ అవుతుంటారు. రోజురోజుకూ మరింత బరువులు మోస్తూ, కఠినమైన వర్కవుట్లు చేస్తూ తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే ప్రగతి ఫిట్ నెస్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ప్రగతి తన క్యూట్ స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగానే ప్రగతి చేసే ఫీట్స్ అందరినీ నోరెళ్లబెట్టాలే చేస్తుంది.

ఫస్ట్ లాక్డౌన్ నుంచి ప్రగతి అందరినీ ఇలా షాక్‌కు గురి చేస్తూనే ఉంది. క్లాసికల్ స్టెప్పులు, లుంగీ డ్యాన్సులు, మాస్ స్టెప్పులు వేస్తూ ఊపు ఊపేస్తూ వచ్చింది. ఇక జిమ్‌లో ఖాళీ టైం దొరికితే చాలు ప్రగతి స్టెప్పులు వేస్తుంది. అయితే తాజాగా ప్రగతి ఓ అమ్మాయితో కలిసి స్టెప్పులు వేసింది. ప్రగతి పక్కన ఉన్న అమ్మాయి తొడల అందాలు కనిపించేలా బుల్లి నిక్కర్లో స్టెప్పులు వేసింది. ఇక ప్రగతి మాత్రం టీ షర్ట్, జీన్స్‌లో దర్శనమిచ్చింది. ఆ బట్టల్లో ప్రగతి స్టెప్పులు వేసింది. అలా జీన్స్, టీ షర్ట్‌లో ప్రగతి స్టెప్పులు చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపించింది. ఆమె వేసిన క్యూట్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. అదిరిపోయింది ఆంటీ అంటూ నెటిజన్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు.

artist pragathi amazing dance video viral

artist pragathi amazing dance video viral

ఇక నిన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. అందులో ప్రగతి వేసిన స్టెప్పులు, ఆదితో కలిసి ఊపేసిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇందులో లోకల్ ప్రగతి బయటకు వచ్చింది. లోకల్ ప్రగతిని బయటకు తీసుకొచ్చారు అని ప్రగతి కూడా అనేసింది. మొత్తానికి ప్రగతి మాత్రం తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రగతి ఇటు బుల్లితెర, అటు వెండితెరపైనా బిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు ఆమెకు వస్తోన్న పాత్రలు అన్నీ కూడా డిఫరెంట్‌గానే ఉంటున్నాయి. ఒకప్పటిలా తల్లి పాత్రలు రావడం లేదు. మొత్తానికి ప్రగతి ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. ఆమె ఫోటో షూట్లు సైతం నెట్టింట్లో చర్చలకు దారి తీస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp