Pragathi : ప్ర‌గ‌తి ఆంటీ డ్యాన్స్‌తో పిచ్చెక్కించేస్తుందిగా.. ఏందా ఊప‌డం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pragathi : ప్ర‌గ‌తి ఆంటీ డ్యాన్స్‌తో పిచ్చెక్కించేస్తుందిగా.. ఏందా ఊప‌డం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :29 April 2022,8:00 pm

Pragathi : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన ప్ర‌గ‌తి ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ సంద‌డి చేస్తుంది. ఇన్నోసెంట్ ఫేస్‌తో కామెడీ పండించడంలో ప్రగతి టాప్ యాక్టరస్‌గా పేరు తెచ్చుకుంది. కాని సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతోంది ప్రగతి మహవాడి. సినిమాల్లో అత్త, వదిన, తల్లి, అక్క పాత్రల్లో ఒదిగిపోయే.. ఈ అమ్మ‌డు త‌న బ‌ర్త్ డే సెలబ్రేషన్‌కి మాత్రం హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్నట్లుగా రెడీ అయింది. స్టైలిష్ గా రెడీ అయిన ప్ర‌గ‌తిని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ప్రగతి నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా కూడా పాపులర్ అయింది.

ఆమె ఏ పాటకు స్టెప్స్ వేసినా..రెస్పాన్స్‌ విపరీతంగా వస్తోంది.తాజాగా ఈ అమ్మ‌డు తెగ ఊపుతూ చిందులేసింది. ప్ర‌గ‌తి ర‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఏంది ఆంటీ ఈ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ట్రెడిషనల్‌గా..సోషల్ మీడియాలో ట్రెండీగా కనిపించే ప్రగతి ఆంటీ అందాలను చూసి ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ తెగ క్రేజీ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జన్మించిన ప్రగతి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం చెన్నైలో స్థిరపడింది.

pragathi dance video viral

pragathi dance video viral

Pragathi : అద‌ర‌గొట్టేసింది…

తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది ప్రగతి. చదువుకునే రోజుల్లోనే చెన్నైలో పలు ప్రకటనల్లో నటించింది. ఆమెను చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా ‘వీట్లవిశేశాంగ’ సినిమాలో హీరోయిన్‌‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. పెళ్ళయాక సినిమాలకి దూరంగా ఉన్న ప్రగతి.. ఆ తర్వాత టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.ఇప్పుడు సినిమాలు కూడా చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌గ‌తికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మ‌రో రేంజ్‌లో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది