Pragathi : ప్రగతి ఆంటీ కూతురు పిక్.. నా సర్వస్వం నువ్వే అంటూ ఎమోషనల్

Authored By aruna | The Telugu News | Published on: September 27, 2022, 3:30 pm

Pragathi : టాలీవుడ్ నటి ప్రగతి నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నటిగా ప్రగతికి ఒకప్పుడు ఉన్న క్రేజ్ వేరు.. ఇప్పుడున్న క్రేజ్ వేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రగతికి తిరుగులేని క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. కరోనా టైంలో ప్రగతి వీడియోలు ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. లుంగీ కట్టి వేసిన డ్యాన్సులు, క్లాసిక్ స్టెప్పులతో ప్రగతి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కూతురు, కొడుకులతో కలిసి ప్రగతి వేసిన స్టెప్పులను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ప్రగతి సోషల్ మీడియాలో పాపులర్ సెలెబ్రిటీ అయింది. ఆమె కట్టూబొట్టూ అంతా కూడా మారింది.జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తుంది.

నాలుగు పదుల వయసులోనూ ప్రగతి కష్టపడే తీరు చూసి అందరూ ఫిదా అవుతుంటారు. తాను మహిళలకు స్పూర్తినిచ్చేలా ఉండాలంటూ ప్రగతి చెబుతుంటుంది. అందుకే ఇలా జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటాను అని చెబుతుంటుంది. గ్లామర్‌గా కనిపించేందుకు ఇవన్నీ చేయడం లేదు.. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేందుకు ఇదంతా చేస్తుంటాను అని అంటుంటుంది. ఇక ప్రగతి అప్పుడప్పుడు తన పిల్లల గురించి చెబుతుంటుంది. తన కూతురు గీత గురించి చెబుతూ.. ఆమె బర్త్ డే ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ప్రగతి కూతురు గీత ఫోటోలు, పార్టీ ఈవెంట్లలో ఈ తల్లీకూతుళ్లు చేసే సందడి మామూలుగా వైరల్ అవ్వదు.

Pragathi Mahavadi Shares Her Daughter Geetha Mahavadi

Pragathi Mahavadi Shares Her Daughter Geetha Mahavadi

ప్రగతిలానే గీత కూడా ఎంతో మోడ్రన్‌గా ఉంటుంది. పొట్టి బట్టల్లో ఈ ఇద్దరూ సందడి చేస్తుంటారు. ఇక తాజాగా ప్రగతి తన కూతురి మీద ప్రేమను కురిపించింది. డాటర్స్ డే అంటూ తన కూతురి గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. నా ఆశ, నా బలం, నా నమ్మకం, నా గర్వం, నా కాన్ఫిడెన్స్ అన్నీ నువ్వే.. నా సర్వస్వం నువ్వే.. నీ లాంటి కూతురు నాకు ఉన్నందుకు నేను ఓ గొప్ప తల్లిని అని భావిస్తాను.. ఇలా ఎదుగుతూనే ఉండు..వెలుగుతూనే ఉండు.. నిన్ను మిస్ అవుతున్నా.. లవ్యూ అమ్ములు అంటూ ప్రగతి ఎమోషనల్ పోస్ట్ వేసింది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp