Pragathi : ఇవేం వర్కవుట్లురా బాబు.. ప్రగతి విన్యాసాలు మామూలుగా లేవు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 5, 2022, 5:00 pm

Pragathi : నటి ప్రగతి చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి ప్రగతి అతి చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంటుంది. కరోనా, లాక్డౌన్ సమయంలో ప్రగతి చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె వేసిన స్టెప్పులు, చేసిన వర్కవుట్లు, లుంగీ డ్యాన్సులు, క్లాసికల్ నృత్యం ఇలా అన్నీ కూడా నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. ఆమె చేసిన ఈ పనుల వల్లే విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. నేడు ఉన్న ఈ పాపులారిటీని ఎంజాయ్ చేస్తోంది.ఆమె తన ఇమేజ్ మొత్తాన్ని మార్చేసుకుంది.

అందుకే ఆమెకు వచ్చే పాత్రలు కూడా అలానే ఉన్నాయి. కేవలం సిల్వర్ స్క్రీన్ అని కాకుండా.. బుల్లితెరపైనా పుష్కలమైన ఆఫర్లను రాబట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజురోజుకూ ఫాలోవర్లను పెంచేసుకుంటోంది. యాడ్స్ రూపంలోనూ బాగానే సంపాదించేస్తోంది. బయటకు వచ్చినప్పుడు ఆమె వస్త్రాధారణ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. చీరకట్టులో మెరిసినా.. ఆమె తన స్టైల్లోనే వస్తుంటుంది. అలా ప్రగతికి నెట్టింట్లో ఉన్న డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక ఆమె నిత్యం తన ఫిట్ నెస్ గురించి కష్టపడుతూనే ఉంటుంది. ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంటుంది.

Pragathi Mahavadi Workout Video Viral

Pragathi Mahavadi Workout Video Viral

మొత్తానికి ప్రగతి మాత్రం రోజురోజుకూ వర్కవుట్లు చేయడంలో కొత్త పుంతలు తొక్కేస్తోంది. జిమ్నాస్టిక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే చేస్తోంది. చూస్తుంటే స్టార్ హీరో తన సినిమా కోసం ఎలా తనని తాను మార్చుకుంటాడో అలా మారిపోతోంది. తాజాగా ఆమె చేసిన విన్యాసాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె వర్కవుట్లు కూడా శ్రుతి మించిపోతోన్నట్టుంది. రీల్ వీడియోల కోసమే లేదంటే ఫేమస్ అవ్వడానికి ఇలా శక్తికి మించిన బరువును మోస్తోంది ప్రగతి. తాజాగా ఆమె వాటిని లాగేందుకు ఎంత కష్టపడిందో కనిపిస్తోంది. ఇలాంటివి చేయకండని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ప్రగతి వర్కవుట్లు మాత్రం నోరెళ్లబెట్టేలా ఉన్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp