Pragya Jaiswal : కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ పరువాలు..
Pragya Jaiswal : టాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అదేంటి ఈ బ్యూటీ నటించిన అఖండ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా అప్పుడే ఎలా నిద్ర చెడగొడుతుందా? అని ఆలోచిస్తున్నారా. అఖండ సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే పోస్టులతో కుర్రకారు సతమతమవుతున్నారు. మత్తెక్కించే విధంగా చూస్తూ ప్రగ్యా జైస్వాల్ ఫోజిచ్చిన హాట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తెలుగు కంటే ముందుగానే ఈ చిన్నది తమిళ సినిమాల్లో మెరిసింది. 2014లోనే ఈ బ్యూటీ విరాట్టు అనే తమిళ మూవీలో నటించింది. అంతే కాకుండా 2014లోనే డేగ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ కు తెరంగ్రేటం చేసింది. టిటూ ఎంబీఏ అనే సినిమా ద్వారా 2014లోనే బాలీవుడ్ తెరకు కూడా పరిచయమైంది. ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన జోరును చూపెట్టింది.
Pragya Jaiswal : ఆ సినిమాతో మారిన ఫేమ్..
2015లో తెలుగులో చేసిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో ఈ అమ్మడు జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో అమ్మడు అభినయం చూసిన డైరెక్టర్ క్రిష్ తన నెక్ట్స్ సినిమాలో ఈ చిన్నదానికి అవకాశం ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఈ చిన్నది మెరుస్తుంది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక, నాగ్ హీరోగా తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో కూడా సపోర్ట్ ఆర్టిస్ట్ గా మెరిసింది.