Prakash Raj : మ‌హేష్ బాబు సినిమా ఇష్టం లేకుండానే చేశానంటూ ప్రకాష్ రాజ్ సంచ‌ల‌న కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 18 July 2022, 10:00 pm

Prakash Raj : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఒదిగిపోతారు.. గ్యాప్ లేకుండానే వివిధ భాషల్లో ఆయన బిజీ అయ్యారు. విలక్షణమైన ఆయన నటనకు అంతా అభిమానులుగా మారిపోయారు. టాలీవుడ్ విషయానికే వస్తే అప్పటివరకూ బాలీవుడ్ విలనిజం ఇక్కడ రాజ్యమేలుతూ ఉండేది. గ్రామీణ స్థాయి విలనిజంలోను బాలీవుడ్ ఆర్టిస్టుల హవా కొనసాగేది. అలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రకాశ్ రాజ్ విల‌న్‌గా కాకుండా హీరో ఫాదర్ గాను .. హీరోయిన్ ఫాదర్ గాను ప్రత్యేకమైన ముద్రవేశారు.

ప్రకాశ్ రాజ్ తాను చేసిన పాత్రల్లో తనకి నచ్చని ఒక పాత్రను గురించి తాజా ఇంటర్యూలో ప్రస్తావించారు. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను గురించి ఆయన ప్రస్తావించడం విశేషం. ఈ సినిమాలో ఆయన ‘ఎద్దుల నాగేంద్ర’ పాత్రలో రాజకీయనాయకుడిగా కనిపిస్తారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ .. “ఏదైనా ఒక పాత్రను ఇష్టపడి చేయాలి .. ఆసక్తితో చేయాలి .. ఉత్సాహంతో చేయాలి. అలా లేని పాత్రలో ఇన్వాల్వ్ కాలేము. మొదటి నుంచి కూడా నాకు మూస పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని సార్లు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పాత్రలు ఉన్నాయి. అలా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోను చేయవలసి వచ్చింది.

prakash raj about his character in mahesh Babu Movie

prakash raj about his character in mahesh Babu Movie

Prakash Raj : ఇష్టం లేకుండానే..

ఆ పాత్ర నాకు నచ్చకపోయినా .. చేయక తప్పలేదు. కొన్నిసార్లు మన ఆలోచనలకు .. అభిప్రాయాలకు అవకాశం ఉండదు. ఆ పాత్రను చేయడం నాకు చాలా అసంతృప్తిని కలిగించింది. మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో ఆ పాత్ర నేను ఇబ్బంది పడుతూ చేశాను. కానీ ఆయన నిర్మించిన ‘మేజర్’ సినిమాలోని పాత్రను ఇష్టపడి చేశాను. అందువలన బ్యాలెన్స్ అయిందనే అనుకుంటున్నాను. నా కెరియర్ లో నేను చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ కాంజీవరం’ .. ‘ఆకాశమంత’ .. ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలు నాకు నచ్చుతాయి. అలాంటి పాత్రలు సంతృప్తిని కలిగిస్తాయి అని ప్రకాశ్ రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి