Pranitha : ప్రణీత తగట్లేదుగా.. బేబి బంప్‌తో తెగ చిందులేస్తుంది..!
Pranitha : ”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ ఇటీవల తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ప్రణీత.. సిద్ధార్థ్‌తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు . పవన్ కల్యాణ్‌తో ”అత్తారింటికి దారేది’, మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’, జూనియర్ ఎన్టీఆర్ తో ”రభస”, మంచు విష్ణుతో ”పాండవులు పాండవులు తుమ్మెద”, రామ్‌తో ”హలో గురు ప్రేమకోసమే” చిత్రాలతో అలరించారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలకు సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. గతేడాది ”హంగామా2”, ”భూజ్” సినిమాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె కన్నడలో నటిస్తున్న ”రామణ అవాతార” చిత్రం షూటింగ్ దశలో ఉంది.ప్రేమ వివాహం చేసుకున్న ప్రణీత.. తన ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని రహస్యంగా ఉంచింది. ఏ ఒక్కరికీ తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. చివరకు ఫోటోలు బయటకు రావడం అసలు విషయం తెలుసుకున్నారు జనం. ఆ తర్వాత ప్రణీత ఓపెన్ అయింది.గతేడాది ప్రణీత- నితిన్ రాజుల వివాహాం జరగ్గా ఈ ఏడాది పేరెంట్స్ కాబోతున్నారు ఈ జోడీ.

pranitha dance video viral
Pranitha : తగ్గేదే లే..
ఇక బేబి బంప్‌తో ఈ అమ్మడు చేస్తున్న హంగామా మాములుగా లేదు. తెగ చిందులేస్తూ కనిపించింది. ప్రణీత జోరు చూసి కుర్రకారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత, నితిన్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తవ్వలేదు. కానీ ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోల్లో ప్రణీత భర్తను గట్టిగా హగ్ చేసుకుని పట్టలేని సంతోషంతో కనిపించింది. అవధుల్లేని ఆనందంలో మునిగి తేలింది.
View this post on Instagram