Pranitha : తల్లి కాబోతోన్న ప్రణీత.. భర్త మీదకు ఎక్కి మరీ వెరైటీ ప్రకటన
Pranitha : హీరోయిన ప్రణీత సుభాష్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో నటించి చాలా రోజులే అవుతోంది. కానీ ప్రణీత మాత్రం ఇప్పుడు అందరి కంటే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. మంచి పనులు చేస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి ఆదరణను దక్కించుకుంటోంది. కరోనా సమయంలో ప్రణీత చేసిన మంచి పనులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉన్నంతలో, తనకు చేతనైన సాయాన్ని అందిరికీ చేసింది.అయితే ప్రణీత మాత్రం తన ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని ఎంతో రహస్యంగా ఉంచేసుకుంది.
చివరకు ఫోటోలు బయటకు వచ్చే వరకు వ్యవహారం ఎవ్వరికీ తెలిసిందే. తన ఫోటోలు అలా బయటకు రావడంతో ప్రణీత అసలు విషయం చెప్పేసింది. ఎవ్వరినీ పిలవలేదు.. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాను అంటూ ప్రణీత అసలు విషయాన్ని చెప్పేసింది.గత ఏడాది ప్రణీత నితిన్ రాజుల వివాహాం జరిగింది. అయితే నేడు తన భర్త 34వ బర్త్ డే అని ప్రణీత ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇందుకోసం ఆమె చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Pranitha Subhash shares Good News That She Got Pregnant
మా ఆయన 34వ బర్త్ డే సందర్భంగా పైనున్న దేవతలు మాకు ఓ బహుమతి ఇవ్వబోతోన్నారు అంటూ అసలు విషయాన్ని అందంగా చెప్పేసింది.భర్త మీదకు ఎక్కేసిన ప్రణీత.. తాను టెస్ట్ చేసుకున్నానని, పాజిటివ్ వచ్చిందంటూ చెప్పకనే చెప్పేసింది. మొత్తానికి ప్రణీత మాత్రం త్వరలోనే తల్లి కాబోతోందని అర్థమవుతోంది. ఇక ప్రణీత అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి తల్లి అయిన అనంతరం సినిమాల్లో నటిస్తుందా?లేదా? అన్నది చూడాలి.