Prabhas Salaar Update ప్రభాస్ కెరీర్ లో యాక్షన్ సినిమాలంటే అందరికీ ముందు గుర్తొచ్చేది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంఛైజీ. యాక్షన్ సీక్వెన్స్ ఛత్రపతిలో ఒక రకంగా.. బాహుబలి సినిమాలో ఒకరకంగా తెరకెక్కించాడు రాజమౌళి. ముఖ్యంగా బాహుబలి రెండు భాగాలలో కూడా కాలకేయ తో తెరకెక్కిన వార్ ఎపిసోడ్ .. అలాగే రెండవ భాగంలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాల రేంజ్ ని తలపిస్తాయి. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సాధించిన ప్రభాస్ సాహో అన్న సినిమా చేశాడు.
హాలీవుడ్ రేంజ్ సినిమాగా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాహో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే దేశం మొత్తం భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో రాధే శ్యాం అన్న పీరియాడికల్ సినిమా తో పాటు సలార్.. ఆదిపురుష్..వైజయంతీ మూవిస్ నిర్మించే నాగ్ అశ్విన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలలో రాధే శ్యాం పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమా నుంచి భారీ యాక్షన్ సీన్స్ ని ఆశించే అవకాశాలు లేవు.
ఈ విషయం మేకర్స్ కూడా హింట్ ఇచ్చారు. ఇక మిగతా మూడు సినిమాలలో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది సలార్. ఈ సినిమాలో ప్రభాస్ వైల్డ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడని అంటున్నారు. అయితే కేజీఎఫ్ 1 అండ్ 2 సినిమాలని తెరకెక్కించిన బ్యాక్ డ్రాప్ లోనే సలార్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అందుకే పోస్టర్ ని కూడా బ్లాక్ షేడ్ లో డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. అయితే కేజీఎఫ్ పార్ట్స్ లాగానే సేమ్ బ్యాక్ డ్రాప్ లో సలార్ ని తెరకెక్కిస్తే వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఉన్న సందేహం అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.