Jai Hanuman 2025 : తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హనుమాన్ ‘ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల పోటీ ఉన్నా హనుమాన్ సినిమా మిగతా సినిమాల కంటే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పటికి జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. అంతలా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. సినిమాలో ఆఖరి ఐదు నిమిషంలో హనుమంతుడి ఎంట్రీతో హిమాలయాల్లో ఉన్న హనుమంతుడు అంజనాద్రి వచ్చేవరకు తీసిన సన్నివేశం సినిమాలోని హైలెట్ గా అనిపించింది. ఈ సన్నివేశం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించింది.
ఇక ప్రశాంత్ వర్మ నెక్స్ట్ తీయబోయే అధిరా సినిమా తర్వాత జై హనుమాన్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని క్లైమాక్స్ లో చూపించాడు. సెకండ్ పార్ట్ లో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారు..రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనేదానిపైన ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం తేజా సజ్జా ప్లేస్ లో వేరే హీరో వస్తాడని అంటున్నారు. అయితే రాముడు హనుమంతుడికి మాట ఇచ్చిన సందర్భంలో రాముడి పాత్రలో రామ్ చరణ్ నటిస్తాడని ప్రశాంత్ వర్మ నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో శ్రీరాముడి లాగా ఉన్నాడని నార్త్ వాళ్ళు జై శ్రీరామ్ అంటూ నినాదం చేశారు.
అయితే అది సీతారామరాజు పాత్ర కానీ రామ్ చరణ్ అచ్చం శ్రీరాముడి లాగా కనిపించాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ను జై హనుమాన్ లో శ్రీరాముడి పాత్రలో ఐదు నిమిషాల నిడివి కోసం తీసుకుంటారని సమాచారం. ఇక హనుమంతు పాత్రలో మరో యంగ్ హీరోని ప్రశాంత వర్మ తీసుకుంటారని సమాచారం. మొత్తానికి అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ 2025 సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాడు. హనుమాన్ సినిమా ఓ రేంజ్ లో హిట్ అవడంతో ప్రేక్షకులు కూడా సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తి చూపుతున్నారు. ఇక జై హనుమాన్ సినిమా కూడా 2025లో సంక్రాంతికి విడుదల అవుతుందని సమాచారం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తున్నా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు హనుమాన్ కి మించి జై హనుమాన్ సినిమా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.