Keerthy Suresh : కీర్తి సురేష్ మీద వాలిన సమంత స్టైలిష్ట్ ప్రీతమ్!
Keerthy Suresh సమంత నాగ చైతన్య విడాకుల అనంతరం సెలెబ్రిటీ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. సమంతకు ప్రీతమ్ మధ్య అక్రమ సంబంధాలను అంటగడుతూ కథనాలు వచ్చాయి. అయితే ఆ రూమర్ల మీద అటు సమంత ఇటు ప్రీతమ్ ఇద్దరూకూడా తెగ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. తన మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారంటూ సమంత వాపోయింది.

Preetham Jukalker Wishe To Keerthy Suresh
సమంతను తాను అక్కా అని పిలుస్తాను అని, మా రిలేషన్ గురించి చైతన్యకు తెలుసంటూ ప్రీతమ్ అసలు కథను చెప్పేశాడు. మా గురించి తెలిసీ కూడా రూమర్లను ఖండించకపోవడం నాకు బాధగా అనిపించిందంటూ చైతూ గురించి ప్రీతమ్ అన్నాడు. అయితే శ్రీరెడ్డి ఈ కథలోకి వచ్చింది. ప్రీతమ్ గే అంటూ బాంబ్ పేల్చింది. అలాంటప్పుడు సమంతతో రిలేషన్ పెట్టుకోడంటూ చెప్పేసింది.
Keerthy Suresh కీర్తి సురేష్‌తో ప్రీతమ్..

Preetham Jukalker Wishe To Keerthy Suresh
అది అలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ప్రీతమ్ ఓ పోస్ట్ చేశాడు. కీర్తి సురేష్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నా మధ్య కీర్తి సురేష్, సమంత, కళ్యాణీ ప్రియదర్శని ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ప్రీతమ్ బర్త్ డే విషెస్ చెప్పాడు. దాంట్లో కీర్తి మీద ప్రీతమ్ వాలిపోయి ఉన్నాడు.