Pawan Kalyan : పవన్ కల్యాణ్ ని తిట్టిన రోజాకి దిమ్మతిరిగే సమాధానం చేపిన 30 ఇయర్స్ పృధ్వీ !
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు.ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమానికి వైజాగ్ చేరుకొన్న పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జనసైనికులు భారీగా స్వాగతం పలికారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే పవన్ వైజాగ్ పర్యటన ప్లాప్ అంటూ ప్రత్యర్థులు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తిగా ఫ్లాప్ అంటూ ప్రత్యర్ధులు ప్రచారాలు మొదలు పెట్టారు. పవన్ సభకు భారీగా వచ్చిన కూడా వందల్లో వచ్చారని దుష్ప్రచారం చేసిన మీడియా ఛానెల్స్ తీరును పృథ్వీ తప్పుపట్టారు.
పవన్ కల్యాణ్ క్రేజ్‌ను తగ్గించేందుకు కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. పంచ్ అదిరింది.. వైజాగ్‌లో వైసీపీ గర్జన కార్యక్రమం ఫ్లాప్ కావడంతో జనసేన కార్యక్రమంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా సినిమా ఫ్లాఫ్ అయిందనే డీలా పడిన కొందరు.. పవన్ కల్యాణ్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి ఒక అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారు. మా సినిమా ఫ్లాప్ అయింది.. ఇక ఎదుటి వారి సినిమాను భ్రష్టుపట్టించినట్టు.. ఫస్టాఫ్ బాగాలేదు.. సెకండాఫ్ బాగాలేదు అంటారు. అదే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల్లో కనిపించింది అని పృథ్వీ ఎద్దేవా చేశారు. పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి కానీ రాజధానిగా వైజాగ్ పనికిరాదా అని రోజా పవన్ ని విమర్శించిన నేపథ్యంలో పృథ్వీ అదిరిపోయే పంచ్ ఇచ్చారు.

Pridhvi gave reply to Roja who insulted Pawan Kalyan
రోజా చెన్నైకి చెందిన సెల్వమణిని వివాహం చేసుకుంది. ఆ లెక్కన చెన్నైలో ఏపీ రాజధాని పెట్టాలి మరి అని నటుడు పృథ్వి అన్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, రెండు చోట్ల ఓడిపోయాడంటూ వ్యకగత దూషణలకు దిగుతున్నారని పృథ్వి ఆక్రోషం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను దూషించకపోతే.. మంత్రి పదవి పోతుందనే అభద్రతాభావం ఆమెలో ఉంది. అందుకే ఆమె దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మేమంతా కళామతల్లి బిడ్డలం. కాబట్టి హుందాగా ఉంటాం. రోజా ఆ హుందాతనాన్ని చూపించుకోవడం లేదు అంటూ పృథ్వీ కామెంట్ చేశాడు.