Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌కి వచ్చేటప్పుడు కూడా నాదగ్గర రూపాయి లేదు.. లోన్ తీసుకొని బిగ్ బాస్‌కి వచ్చా.. ఏడ్చేసిన ప్రిన్స్ యావర్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 23, 2023, 12:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ కి రాకముందు, బిగ్ బాస్ కి వచ్చేముందు నేను లోన్ తీసుకున్నా. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. ఈ టైమ్ కి కూడా నా అన్న నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయనే నాకు డబ్బులు ఇచ్చాడు. నేను నాకు బట్టలు కావాలని కూడా అడగను. ఎందుకంటే.. వాళ్లు అంత డబ్బులు పెట్టి నాకు కొనలేరు. నాకు హంగర్ ఉంది.. అంతకు మించి ఏం లేదు. అందరి దగ్గర కొంత డబ్బు ఉంటుంది. ఎందుకంటే వాళ్లు పని చేస్తారు కాబట్టి. కానీ నాకు ఏ జాబ్ లేదు. నేను ఏ పని చేయట్లేదు. నా దగ్గర 100 రూపాయలు కూడా లేదు. నేను బిగ్ బాస్ కి వచ్చే సమయంలో నా అకౌంట్ లో జీరో బ్యాలెన్స్. నా దగ్గర రూపాయి కూడా లేదు. అందుకే నా దగ్గర అగ్రెషన్ ఉంది. బిగ్ బాస్ కి వచ్చే సమయంలోనే నా అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయి అంటూ ప్రిన్స్ యావర్.. శివాజీకి తన బాధ చెప్పుకున్నాడు.

prince yawar cries infront of shivaji in bigg boss telugu 7

#image_title

మూడో ఇంటి సభ్యుడి కోసం జరుగుతున్న టాస్క్ లో ప్రియాంక, శోభ ఇద్దరూ కలిసి ప్రిన్స్ యావర్ ను అర్హత లేనట్టుగా చెప్పడంతో యావర్ తట్టుకోలేకపోతాడు. నేను ఇంత కష్టపడితే నన్ను డిజర్వ్ ఎలా కాదంటారంటూ ప్రిన్స్ యావర్ ఆవేశపడ్డాడు. చాలా కోపంతో రగిలిపోయాడు. నువ్వు చాలా అగ్రెసివ్ అవుతాడు.. ఓటమిని కూడా తీసుకోలేవు. నీలాంటి వాళ్లు ఇంటి సభ్యులు అయితే అమ్మో.. ఆ ఒక్క పాయింట్ తోనే నువ్వు అర్హుడివి కాదు అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. దీంతో యావర్ కి ఇంకా కోపం వచ్చింది.

Bigg Boss Telugu 7 : యావర్ ను ఓదార్చిన శివాజీ

నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ హంగర్ కి అది ఒక సొల్యుషన్ అవుతుందా? భగవంతుడు చూస్తాడు. నన్ను నమ్ము. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. పెద్దలు ఊరికే చెప్పలేదు అంటూ శివాజీ.. యావర్ ను ఓదార్చుతాడు. దీంతో ప్రిన్స్ యావర్ కూల్ అవుతాడు. నిజానికి.. మూడో ఇంటి సభ్యుడి కోసం జరుగుతున్న టాస్క్ లో ప్రిన్స్ యావర్ కి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే.. అంతసేపు నిలబడి కంటెస్టెంట్లు అంతా ఏం చేసినా కూడా దవడ కూడా లేపకుండా యావర్ కష్టపడ్డాడు. కానీ.. దానికి తగ్గ ప్రతిఫలం యావర్ కు దక్కలేదు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp