
#image_title
Bigg Boss Telugu 7 : ఇన్ని రోజులు ప్రశాంత్ ని పిచ్చోడిని చేసింది రతిక. డే వన్ నుంచి ప్రశాంత్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది రతిక. దాదాపు ఓ వారం ఇద్దరూ బాగానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో.. రతిక ఈడ్చి తంతే ప్రశాంత్ వెళ్లి ఎక్కడో పడ్డాడు. నువ్వంటే నాకిష్టం అంటూ మెలికలు తిరిగిన ప్రశాంత్ ఇప్పుడు రతిక అంటేనే భయపడిపోతున్నాడు. నిజానికి రతిక వల్లనే ప్రశాంత్ కు బిగ్ బాస్ హౌస్ లో బ్యాడ్ నేమ్ వచ్చింది. రైతు బిడ్డ అని చెప్పి హౌస్ లోకి వెళ్లి ఈ పనికిమాలిన పనులు ఏంటి. రతిక వెంట తిరగడం ఏంట్రా అంటూ బిగ్ బాస్ అభిమానులు ప్రశాంత్ పై ఫైర్ అయ్యారు.
#image_title
ఆ తర్వాత రెండో వారం నామినేషన్స్ లో ప్రశాంత్ ను నామినేట్ చేసి రైతు బిడ్డ రైతు బిడ్డ అంటూ చెప్పి ఇక్కడికి వచ్చావు కదా.. అమ్మాయిల వెంట తిరగడం కాదు. ఇక్కడికి వచ్చినందుకు గేమ్ ఆడు అంటూ రతిక సీరియస్ అవడంతో అప్పటి నుంచి ప్రశాంత్ రతికతో పెద్దగా మాట్లాడటం లేదు. అయితే.. ప్రశాంత్, రతిక విడిపోయారు కానీ.. ఇప్పుడు మళ్లీ రతిక, ప్రిన్స్ ఈ జంట కలిసినట్టు అనిపిస్తోంది. కన్ఫెషన్ రూమ్ కు వెళ్లి వచ్చిన తర్వాత ప్రిన్స్ యావర్ పూర్తిగా మారిపోయాడు. రతిక ఐ లైక్ యూ అని చెప్పాడు. దీంతో రతిక కూడా ఐ లైక్ యు టూ అని చెప్పేసింది.
అవన్నీ కాదు.. ప్రిన్స్ ను రతిక ముద్దుగా అన్వర్ అని పిలుస్తోంది. రతిక రతిక అంటూ తన వెంట తిరిగిన ప్రశాంత్ ఈ జంటను చూసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టకొని కూర్చొన్నాడు. ఇద్దరూ లవ్ సింబల్ చూపించుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో తెగ హడావుడి చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట మాత్రం బాగుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది. ఇద్దరు కొన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో హద్దులు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే.. రతిక, ప్రశాంత్ మధ్య క్లారిటీ కూడా వచ్చేసింది. నీతో క్లోజ్ గా ఉన్నా అంటే అది మజాక్ కే అని రతికకు చెబుతాడు ప్రశాంత్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది ప్రశాంత్ అని ఇద్దరి మధ్య తెగతెంపులు చేసుకుంటారు. రతికను లవ్ చేస్తున్నావా అని ప్రిన్స్ ను అడుగుతాడు ప్రశాంత్. దీంతో నాకు తెలియదు. కొంచెం ఉంది.. అంటే.. కొన్ని రోజులు ఆగు నీకే తెలుస్తుంది అంటాడు ప్రశాంత్. చూద్దాం.. వీళ్ల ప్రేమ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.