Hyper Aadi : హైపర్ ఆది, సోది ఏం వద్దు!.. పరువుతీసిన ప్రియమణి
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే వేషాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందరితో పులిహోర కలుపుతుంటాడు. అది స్కిట్ల కోసమే అయినా, కామెడీని పుట్టించడం కోసమే అయినా కూడా రియల్‌గానే అనిపిస్తుంది. అంతలా జీవిస్తుంటాడు ఆది. ఇక జబర్దస్త్ షోకి వస్తే అనసూయ జపం చేస్తాడు. అనసూయ మీద తీరని కోరికలున్నవాడిలా ప్రవర్తిస్తుంటాడు.
ఇక ఢీ షోకి వస్తే ప్రియమణి జపం చేస్తుంటాడు. మరీ దారుణంగా ఈ ట్రాక్ ఉంటుంది. హైపర్ ఆదిని బావా అని ప్రియమణి పిలుస్తుంటే ఎంతో కంపరంగా ఉంటుంది. ఇక ఆది కూడా తక్కువేమీ తిన్నాడా? ప్రియ అని ప్రేమను ఒలకబోస్తుంటాడు. ఈ ముదురు ప్రేమతోనే ఢీ షోను కిందా మీదా పడి నెట్టుకొస్తున్నారు. ఈ ట్రాక్ మీద నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది.

Priyamani Avoids Hyper Aadi In Dhee
Hyper Aadi : ఆదిపై ప్రియమణి సెటైర్లు..
తాజాగా వదిలిన ప్రోమోలో ఆది పరువుతీసేసింది ప్రియమణి. సూరజ్ అనే పిల్లాడు ప్రియమణి కోసం స్పెషల్ పర్ఫామెన్స్ చేసి ప్రపోజ్ చేస్తాడు. ఇక నుంచి నాకు ఆది, సోది ఏం వద్దు.. సూరజ్ చాలు అంటూ ప్రియమణి రెచ్చిపోతుంది. అక్కడేమో ఆది ఉడికి పోతుంటాడు. సూరజ్ అనే బుడ్డోడికి ప్రియమణి ఐ లవ్యూ చెబుతుంది. వాడు కూడా రివర్స్‌లో చెబుతాడు.
