Samantha : ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన అందాల ముద్దుగుమ్మ ప్రియమణి. ఈ అమ్మడు ఇప్పటికీ తన అందచందాలతో అదరగొడుతూనే ఉంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్ చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది.ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది.
అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి మాట్లాడింది. వారు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎలా సక్సెస్ సాధిస్తున్నారో వివరించింది. సమంత రీసెంట్‌గా ఊ అంటావా పాటతో ఎంత సంచలనం రేపిందో మనం చూశాం. ఈ సాంగ్ లో సమంత హాట్ హాట్‌గా కనిపించిందని నాకే కాదు నా భర్తకు కూడా అనిపించింది. బహుశా సామ్ కెరీర్‌లో ఇలాంటివి చేసి ఉండకపోవచ్చు. ఈ పాటను చాలా మంది డౌన్‌లోడ్ చేసి, ఇప్పటికే రీల్స్‌ను తయారు చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇది నంబర్ వన్ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్‌కి హ్యాట్సాఫ్. కొరియోగ్రఫీ చాలా అందంగా ఉంది” అంటూ సామ్ పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రియమణి.
ఇప్పుడు హీరోయిన్లు చేసే అన్ని రకాల పాత్రలను పేక్షకులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది ఈ భామ. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి బట్టలు ధరించే రోజులు, పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ మాత్రమే చేసే రోజులు పోయాయి. హీరోయిన్‌కి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సమంత ‘ఓ బేబీ’ చేసింది. నయనతార చాలా బాగా రాణిస్తోంది.ఆమె రజనీకాంత్, విజయ్ సరసన జత కట్టి, మరో పక్క నేత్రికన్, మాయ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో కూడా నటిస్తోంది అంటూ ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.