Bigg Boss 5 Telugu : ఇద్దరం కలిసి ఒకే సారి చేసుకున్నాం.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 8 September 2021, 5:40 pm

Bigg Boss 5 Telugu జబర్దస్త్ సాయి తేజ.. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో సందడి చేస్తోంది. వచ్చిన రోజు నుంచి ఒకే టాపిక్ మీద మాట్లాడుతూ వస్తోంది. తాను ఇంత వరకు లింగ మార్పిడి చేసుకున్న విషయాన్ని తండ్రికి చెప్పలేదని, దాదాపు మూడేళ్లుగా మోసం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చింది. స్టేజ్ మీదే కన్నీరు పెట్టేసింది.

Priyanka Singh About Her Past In Bigg Boss 5 Telugu

Priyanka Singh About Her Past In Bigg Boss 5 Telugu

 

ఇద్దరం కలిసి ఒకే సారి చేసుకున్నాం..ప్రియాంక సింగ్ Bigg Boss 5 Telugu

ఎంట్రీ రోజు స్టేజ్ మీదే చెప్పిన ప్రియాంక.. ఇంట్లోనూ అదే విషయాన్ని పదే పదే లేవనెత్తుతోంది. అయితే మొన్న ఆర్జే కాజల్‌తో ఉన్న సమయంలోనూ చెప్పింది. తన తండ్రి తన మొహాన్ని చేతులతో తాకితే.. లేడీ గెటప్పులు వేస్తున్నాను కదా? అందుకే గడ్డం మీసాలు లేవని చెప్పి మోసం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లోనూ మళ్లీ అదే అంశాన్ని చెప్పింది.

Priyanka Singh About Her Past In Bigg Boss 5 Telugu

Priyanka Singh About Her Past In Bigg Boss 5 Telugu

 

బిగ్ బాస్ 5 తెలుగు నాకు మంచి స్టేజ్. ముసుగు కప్పుకుని ఉన్న మనిషిలా ఉన్నాను. కానీ ఇప్పుడు అలా లేను. మా నాన్న, అమ్మ కోసమో నేను సర్దుకుని ఉంటే.. ఓ అమ్మాయి జీవితాన్ని మోసం చేసినట్టు అయ్యేది. నిషా అని నా చిన్న నాటి ఫ్రెండ్ ఉండేది.. దానికి లింగమార్పిడి గురించి చెప్పాను. నేను చేసుకుంటాను అని చెబితే.. అది కూడా రెడీ అంది. ఇద్దరం కలిసి రాత్రికిరాత్రి ఫ్లైట్ ఎక్కి వెళ్లాం. లింగమార్పిడి చేసుకున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి