Bigg Boss 5 Telugu Manas : ప్రియాంకా సింగ్, తనకు మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను బయటపెట్టేసిన మానస్
Bigg Boss 5 Telugu Manas : బిగ్ బాస్ అనేది గొప్ప ప్లాట్ ఫామ్. దాంట్లో చాన్స్ రావడమే గొప్ప. అయితే.. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం ఎంత ముఖ్యమో అక్కడ ప్రవర్తించే తీరు కూడా చాలా ముఖ్యం. అదే ఒక్కోసారి బెడిసికొడుతుంది. దాని వల్ల కెరీర్ పోతుంది. తాజాగా బిగ్ బాస్ 5లో అదే జరిగింది. కొందరు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నారు. కానీ.. మానస్ మాత్రం క్లీన్ ఇమేజ్ తో బయటికి వచ్చాడు.
నిజానికి టైటిల్ సన్నీ చేతికి వెళ్లినప్పటికీ మానస్ కు ఎక్కువ పేరు వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల మానస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాకపోతే ఒక్క ప్రియాంకా సింగ్ వల్ల మాత్రం మానస్ కు కొంచెం చెడ్డ పేరు వచ్చింది.ఎందుకంటే ప్రియాంకా సింగ్ మానస్ ను ప్రేమించింది. తన ప్రేమను పలు సందర్భాల్లో వ్యక్త పరచడం కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో మానస్.. తనను దూరం పెట్టాడు.

Bigg Boss 5 Telugu manas Relationship about priyanka sing
Bigg Boss 5 Telugu Manas : మానస్ ను ప్రేమించిన ప్రియాంకా సింగ్
కాకపోతే తన పనులు మాత్రం ప్రియాంకతో చేయించుకునేవాడు. కాకపోతే ప్రియాంక తనను లవ్ చేస్తుందనే విషయం మానస్ కు తెలుసు అట. కాకపోతే తన ఫీలింగ్స్ ను నేను రెస్పెక్ట్ చేశా అన్నాడు మానస్.కాకపోతే అమెకు ముందే కూర్చోబెట్టి అన్ని చెప్పాను. లిమిట్స్ క్రాస్ చేయకూడదని చెప్పా. అయినా కూడా తను లిమిట్స్ క్రాస్ చేయడంతో.. ఆమెతో విభేదించాల్సి వచ్చింది అని మానస్.. ప్రియాంక సింగ్ గురించి చెప్పుకొచ్చాడు.