Priyanka Singh Express Her Love To Maanas In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో ట్రాకులు మొదలవుతున్నాయి. అయితే ఈ ట్రాకులో ఎవరు ఎవరితో జోడి కడుతున్నారనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ట్రయాంగిల్ ట్రాకులు కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ఏ ట్రాక్ తీసుకున్నా కూడా అందులో హమీద ఉండేట్టు కనిపిస్తోంది. హమీద మానస్, హమీద సన్నీ, హమీద శ్రీరామచంద్ర ట్రాకులు ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఇవి కాకుండా ప్రియాంక మానస్ ట్రాక్ కూడా పట్టాలెక్కబోతోంది. ఇందులో నిన్న కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
Priyanka Singh Express Her Love To Maanas In Bigg Boss 5 Telugu
నిన్నటి ఎపిసోడ్‌లో హమీదకు గోరు ముద్దలు తినిపించాడు మానస్. ఇక తినిపిస్తూనే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఇలా తినిపిస్తుంటే లహరి జలస్ ఫీల్ అవుతోంది.. ప్రియాంక కూడా అలానే అవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ గోరు ముద్దల విషయం బాగానే హైలెట్ అయింది. ప్రియాంక కూడా తినిపించడంపై బాగానే కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇక జైల్లోకి వెళ్లిన మానస్ దగ్గర కూర్చుని ప్రియాంక తన మనసులోని మాటలను చెప్పేసింది.
Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu
నువ్ జైల్లోకి వచ్చావ్.. హమీదకు ఎవరు తినిపిస్తారు అంటూ మానస్‌కు ప్రియాంక సెటైర్ వేసింది. నువ్ జైల్లోకి రావడం నాకు ఓ రకంగా ఆనందంగా ఉంది అంటూ ఎగిరి గంతులు వేసింది. నీ శాడిజం తగిలెయ్య అంటూ మానస్ నవ్వుకున్నాడు. నేను అప్పుడప్పుడు ఎక్కువ జెలస్ ఫీల్ అవుతాను.. పట్టించుకోకు అని ప్రియాంక చెప్పింది. నాకు తెలుసులే అని మానస్ అన్నాడు. అలా అని పూర్తిగా పట్టించుకోకు అని మళ్లీ ప్రియాంక అనేసింది. ఇంట్లో ఎవ్వరికైనా రాఖీ కట్టేస్తా.. చివరకు శ్రీరామచంద్రకు కూడా కట్టేస్తా.. కానీ నీకు మాత్రం కట్టను అని మానస్ మీదున్న ప్రేమను ప్రియాంక బయటపెట్టేసింది.
Priyanka Singh And Karthika Deepam Bhagyam
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.