Bigg Boss 5 Telugu : మనసులోని మాట చెప్పేసింది.. మానస్‌పై ప్రియాంక ప్రేమ

Advertisement

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో ట్రాకులు మొదలవుతున్నాయి. అయితే ఈ ట్రాకులో ఎవరు ఎవరితో జోడి కడుతున్నారనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ట్రయాంగిల్ ట్రాకులు కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ఏ ట్రాక్ తీసుకున్నా కూడా అందులో హమీద ఉండేట్టు కనిపిస్తోంది. హమీద మానస్, హమీద సన్నీ, హమీద శ్రీరామచంద్ర ట్రాకులు ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఇవి కాకుండా ప్రియాంక మానస్ ట్రాక్ కూడా పట్టాలెక్కబోతోంది. ఇందులో నిన్న కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

Advertisement
Priyanka Singh Express Her Love To Maanas In Bigg Boss 5 Telugu
Priyanka Singh Express Her Love To Maanas In Bigg Boss 5 Telugu

నిన్నటి ఎపిసోడ్‌లో హమీదకు గోరు ముద్దలు తినిపించాడు మానస్. ఇక తినిపిస్తూనే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఇలా తినిపిస్తుంటే లహరి జలస్ ఫీల్ అవుతోంది.. ప్రియాంక కూడా అలానే అవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ గోరు ముద్దల విషయం బాగానే హైలెట్ అయింది. ప్రియాంక కూడా తినిపించడంపై బాగానే కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇక జైల్లోకి వెళ్లిన మానస్ దగ్గర కూర్చుని ప్రియాంక తన మనసులోని మాటలను చెప్పేసింది.

Advertisement

Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu
Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu

నువ్ జైల్లోకి వచ్చావ్.. హమీదకు ఎవరు తినిపిస్తారు అంటూ మానస్‌కు ప్రియాంక సెటైర్ వేసింది. నువ్ జైల్లోకి రావడం నాకు ఓ రకంగా ఆనందంగా ఉంది అంటూ ఎగిరి గంతులు వేసింది. నీ శాడిజం తగిలెయ్య అంటూ మానస్ నవ్వుకున్నాడు. నేను అప్పుడప్పుడు ఎక్కువ జెలస్ ఫీల్ అవుతాను.. పట్టించుకోకు అని ప్రియాంక చెప్పింది. నాకు తెలుసులే అని మానస్ అన్నాడు. అలా అని పూర్తిగా పట్టించుకోకు అని మళ్లీ ప్రియాంక అనేసింది. ఇంట్లో ఎవ్వరికైనా రాఖీ కట్టేస్తా.. చివరకు శ్రీరామచంద్రకు కూడా కట్టేస్తా.. కానీ నీకు మాత్రం కట్టను అని మానస్ మీదున్న ప్రేమను ప్రియాంక బయటపెట్టేసింది.

Priyanka Singh And Karthika Deepam Bhagyam
Priyanka Singh And Karthika Deepam Bhagyam
Advertisement
Advertisement