Radha Madhavam Movie : ప్రముఖ నిర్మాత రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Radha Madhavam Movie : విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ […]
ప్రధానాంశాలు:
Radha Madhavam Movie : ప్రముఖ నిర్మాత రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Radha Madhavam Movie : విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్‌కు లీడ్‌గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి’ అని అన్నారు.
నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు.డైరెక్టర్ ఇస్సాకు మాట్లాడుతూ.. ‘నిర్మాత రాజ్ కందుకూరి గారి మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.రైటర్ వసంత్ వెంకట్ బాలా మాట్లాడుతూ.. ‘మా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. నన్ను సపోర్ట్ చేసిన మా టీంకు థాంక్స్. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.నటీనటులు : వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాత : గోనాల్ వెంకటేష్
దర్శకత్వం : దాసరి ఇస్సాకు
కథ మాటలు పాటలు : వసంత్ వెంకట్ బాలా
సంగీతం : చైతు కొల్లి
కెమెరామెన్ : తాజ్ జీడీకే
ఎడిటర్ : కే రమేష్
ఫైట్స్ : రాబిన్ సుబ్బు
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు