Mahesh Babu : ఫ్యాన్స్‌కు మహేశ్ బాబు ప్రొడ్యూసర్స్ షాక్.. ఇక ఆ సినిమా లేనట్లే..?
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తిసురేశ్ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నుంచి తప్పించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది. కాగా, ఆ లోపు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్న మహేశ్ ఫ్యాన్స్‌కు ప్రొడ్యూసర్స్ షాక్ ఇచ్చారు.మహేశ్‌బాబు ఓన్ ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
‘సర్కారు వారి పాట’ చిత్ర మెజారిటీ షూటింగ్ పార్ట్ ఇప్పటికే ఫినిష్ కాగా, మిగిలిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన సాంగ్స్ చిత్రీకరణ కూడా పూర్తి అయింది. మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేసింది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా..సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ థమన్ ట్విట్టర్ వేదికగా ఇస్తూనే ఉన్నాడు. ఇకపోతే ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి సంక్రాంతి నేపథ్యంలో కాని అంతకు ముందర కాని ఏదేని అప్‌డేట్స్ వస్తాయని ఎదరు చూస్తున్న మహేశ్ అభిమానులకు చిత్ర నిర్మాతలు షాకింగ్ న్యూస్ చెప్పారు.
Mahesh Babu : ఆశలు అడియాసలే..!
చిత్రానికి సంబంధించిన ఏ అప్‌డేట్స్ కూడా ఇవ్వబోమని మూవీ ప్రొడ్యూసర్స్ స్వయంగా తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న సినిమా విడుదల కానుందని మాత్రమే చెప్పారు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ బాబు బ్యాంకర్‌గా కనిపించనున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ‘పోకిరి’ సినిమా రేంజ్‌లో ఉంటుందని ఇటీవల మహేశ్ బాబు ఓ ఈవెంట్‌లో పేర్కొన్నాడు. దాంతో సినీ అభిమానులు, కృష్ణ-మహేశ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఇండస్ట్రీ రికార్డులను మహేశ్ బద్ధలుకొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.