Jabardasth Nukaraju : నూకరాజు గుట్టు రట్టు.. ఆ సంబంధం బయటపెట్టిన కమెడియన్
Jabardasth Nukaraju : జబర్దస్త్, రెచ్చిపోదాం షోలలో చేస్తున్న నూకరాజు.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నూకరాజుకు అతనితో పాటు చేసే ఆసియాకు మధ్య లవ్ ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. వీరిద్దరు లవ్ గురించి పలు సందర్భాల్లో వెల్లడించారు. మిగతా కంటెస్టెంట్‌లు కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. రెచ్చిపోదాం బ్రదర్ షోలో అయితే వీరిద్దరిపై చాలా సార్లు జోక్‌లు పేలాయి.
ఓ స్కిట్‌లో నూకరాజును అన్న అని పిలవడానికి ఆసియా నిరాకరించింది. ఆ తర్వాత ఓ సందర్భంలో ఆసియా నూకరాజుపై అలిగి కన్నీరు పెట్టుకుంది. అయితే తనకు ఆసియా మీద ఉన్న ప్రేమను నూకరాజు చాలా సందర్బాల్లోనే బయటపెట్టాడు. వారి మధ్య రిలేషన్ గురించి నూకరాజు ఏం చెప్పినా.. దానికి ఆసియా నో అనే సమాధానం ఇవ్వదు.

Punch prasad comments on asia nukaraju relation
Jabardasth Nukaraju : నూకరాజు లవ్ స్టోరీ
తాజాగా వీరి మధ్య రిలేషన్ గురించి పంచ్ ప్రసాద్ తనదైన స్టైల్‌లో డైలాగ్‌లు వదిలాడు. ఓ స్కిట్‌లో భాగంగా ఆసియా.. నాకు ఈ మధ్యే తెలిసిందనే డైలాగ్ చెబుతుంది. దీనికి ప్రసాద్.. అక్కయ్య.. మన ఇద్దరి మధ్య ఏం లేదుగా.. నీకు నూకరాజుగా ఉంది అని పంచ్ వేస్తాడు. అప్పుడు ఆసియా నోరు వెళ్ళబెట్టింది. ఇలా ప్రసాద్.. మరోసారి ఆసియా, నూకరాజు రిలేషన్ గురించి ప్రసాద్ బయట పెట్టాడు. ఇక, ఆ తర్వాత షుగర్ ఎలా ఉందని ఆసియా అడగ్గా.. కేజీ 40 అక్క మార్కెట్‌లో, సూపర్ మార్కెట్‌లో అయితే 35కే ఇస్తున్నారు అని ప్రసాద్ చెప్తాడు. దీంతో అక్కుడున్న వారు ఫుల్‌గా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్‌గా మారింది.
