Jabardasth Nookaraju : ఇంకోసారి నా కాళ్లు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు.. నూకరాజుతో ఆసియా ఎమోషనల్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Nookaraju : ఇంకోసారి నా కాళ్లు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు.. నూకరాజుతో ఆసియా ఎమోషనల్ కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :27 June 2022,3:30 pm

Jabardasth Nookaraju : పటాస్ షోతో నూకరాజు, ఆసియా, ఫైమా, ప్రవీణ్ వంటి వారు బాగానే ఫేమస్ అయ్యారు.అయితే పటాస్ షో ఒక్కసారిగా ఆగిపోవడంతో అందరూ తలోదిక్కున వెళ్లిపోయారు. అయితే నూకరాజు, ఆసియాల మధ్య స్నేహం, ప్రేమ ఆ సమయంలోనూ చిగురించాయి. ఫైమా ప్రవీణ్‌ల మధ్య కూడా పటాస్ నుంచే ప్రేమ బంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆసియా నూకరాజు రిలేషన్ మాత్రం ఎక్కువగా బయటకు రాలేదు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ద్వారా వీరి ప్రేమ బంధం బయటకు వచ్చింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆసియా, నూకరాజు, శాంతి కుమార్‌లు కలిసి ఓ స్కిట్ వేశారు.

ప్రస్తుతం పరువు హత్యలు జరుగుతున్న తీరు, ప్రేమ పెళ్లిళ్లు, తల్లిదండ్రులు చేస్తోన్న హత్యల మీద స్కిట్ వేశారు. అది చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. నిజమైన ప్రేమికుల్లా అనిపించారు.. అంత బాగా నటించారు అని రామ్ ప్రసాద్ అంటాడు. నిజమైన ప్రేమికుల్లా ఏంటి.. నిజమైన ప్రేమికులే అని ఆది అంటాడు. ఏంట్రా చెప్పలేదా? అని నూకరాజుని అడుగుతాడు. అయితే ఇక నూకరాజు లవ్ స్టోరీని చెప్పేస్తాడు. ఎవ్వరికీ చెప్పలేదు.. చెబితే నవ్వుతారేమో అనుకున్నాను అని నూకరాజు అంటే.. ఏం కాదు చెప్పేయ్ అని రామ్ ప్రసాద్, ఆది అంటారు. ఇక తాను పట్టుకున్న మైకుని ఆసియాకు ఇచ్చేస్తాడు నూకరాజు. ఆసియా కాళ్లు పట్టేసుకుంటాడు అందరి ముందే.

Asiya Gets EMotional on Jabardasth Nookaraju In Sridevi Drama Company

Asiya Gets EMotional on Jabardasth Nookaraju In Sridevi Drama Company

అలా ఆసియా కాళ్లు పట్టుకోవడంతో అందరూ షాక్ అవుతారు. మళ్లీ మనం విడిపోయే రోజు రావొద్దని కోరుకుంటున్నాను అని నూకరాజు అనడంతో ఆసియా ఎమోషనల్ అవుతుంది. తాను నా కోసం అన్నీ వదిలేసుకుందని ఆసియా గురించి గొప్పగా చెబుతాడు నూకరాజు. మళ్లీ నువ్ నా కాళ్లు పట్టుకునే రోజు.. మన మధ్యన గొడవ వచ్చే రోజు రావొద్దంటూ ఆసియా చెబుతుంది. దీంతో నూకరాజు ఎమోషనల్ అవుతాడు. ఆసియా అంటే నాకు పిచ్చి, ప్రేమ, పెళ్లి చేసుకోమంటే ఇక్కడే చేసుకుంటాను అని ఇలా నూకరాజు ఇలా తన ప్రేమను బయటపెట్టేస్తాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది