Roja : రోజాకు అవమానం.. స్టేజ్ మీద అలిగిన మంత్రి.. ఆది, నూకరాజు గుండెల్లో గుబులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : రోజాకు అవమానం.. స్టేజ్ మీద అలిగిన మంత్రి.. ఆది, నూకరాజు గుండెల్లో గుబులు

Roja : బుల్లితెరపై రోజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు రోజాకు మంత్రిగా పదవి దక్కడంతో.. జబర్దస్త్ షోను మానేసింది. జబర్దస్త్ జడ్జ్‌గా మానేసి.. మంత్రిగా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్లింది. అయితే రోజా ఇప్పుడు మళ్లీ ముఖ్య అతిథిగా స్పెషల్ ఈవెంట్‌కు వచ్చింది. దసరా కోసం మల్లెమాల నిర్వహిస్తోన్న దసరా వైభవం ఈవెంట్‌లో రోజా మెరిసింది. లేడీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 September 2022,8:30 pm

Roja : బుల్లితెరపై రోజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు రోజాకు మంత్రిగా పదవి దక్కడంతో.. జబర్దస్త్ షోను మానేసింది. జబర్దస్త్ జడ్జ్‌గా మానేసి.. మంత్రిగా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్లింది. అయితే రోజా ఇప్పుడు మళ్లీ ముఖ్య అతిథిగా స్పెషల్ ఈవెంట్‌కు వచ్చింది. దసరా కోసం మల్లెమాల నిర్వహిస్తోన్న దసరా వైభవం ఈవెంట్‌లో రోజా మెరిసింది. లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశారు. ఇక రోజా ఈ ప్రోమోలో అదరగొట్టేసింది. ప్రోమో అంతా కూడా రోజానే హైలెట్ అయింది.

ఇక ప్రోమో చివర్లో ప్రమోషనల్ స్టంట్స్ అదిరిపోయాయి. ఇలాంటి ప్రోమో స్టంట్లు ఇది వరకే మనం ఎన్నో చూశాం. ఇలా ప్రోమో చివర్లో ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసేందుకు మల్లెమాల డైరెక్షన్ టీం బాగానే ప్లాన్లు వేస్తుంటుంది. ప్రోమోల్లో ఉండేంత కంటెంట్ గానీ పసగానీ ఎపిసోడ్‌లో ఉండదని అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పాచిపోయిన స్ట్రాటజీలతోనే ప్రోమోను కట్ చేశారు. ప్రోమో చివర్లో.. రోజా బాగానే నటించింది. పిలిచి అవమానిస్తున్నారా? అంటూ రోజా తనకు వేసిన మాలను విసిరి పారేసింది. నూకరాజు ఏదో ఒక సెటైర్ వేసినట్టున్నాడు. దానిపై రోజా హర్ట్ అయినట్టుంది. కావాలనే ఇలా చేశారా? అంటూ రోజా అనేసింది.

Minister Roja Faces Humiliation On Etv Mallemala Dasara Vaibhavam Event

Minister Roja Faces Humiliation On Etv Mallemala Dasara Vaibhavam Event

వాడు కూడా అదే అంటున్నాడు? అని ఆది ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రోజా మాత్రం నటించడంలో మరింత జీవించేసింది. ఇక స్టేజ్ మీద నుంచి వెళ్లిపోతోన్నట్టుగా నడుచుకుంటూ ముందుకు పోయింది. దీంతో స్టేజ్ మీద ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అలా రోజా అలిగి వెళ్లిపోతోండటం.. నూకరాజు, ఆది గుండెల్లో గుబులు పుట్టినట్టుగా చూపించారు. ప్రోమోలో ఇంత కంటెంట్ ఉంది. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఇదంతా ఊరికే చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చూడలేదు అంటూ జనాలు ఈ ప్రోమోను లైట్ తీసుకుంటున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది