Punch Prasad : పంచ్ ప్రసాద్‌కు చేదు అనుభవం.. లాగి పెట్టి కొట్టేసిన అమ్మాయి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Punch Prasad : పంచ్ ప్రసాద్‌కు చేదు అనుభవం.. లాగి పెట్టి కొట్టేసిన అమ్మాయి

Punch Prasad : ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా పంచ్ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు షోల్లో పంచ్ ప్రసాద్ రఫ్ఫాడిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ పంచ్‌లకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఈ మధ్య కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు, వాటి మీద ఆది, రాం ప్రసాద్ ఇచ్చిన క్లారిటీల విషయంలో పంచ్ ప్రసాద్ గురించి కూడా ప్రస్థావించారు. పంచ్ ప్రసాద్ ఎంత సంపాదిస్తున్నాడో చెప్పేశాడు. పంచ్ ప్రసాద్‌కు కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్‌లో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,1:30 pm

Punch Prasad : ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా పంచ్ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు షోల్లో పంచ్ ప్రసాద్ రఫ్ఫాడిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ పంచ్‌లకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఈ మధ్య కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు, వాటి మీద ఆది, రాం ప్రసాద్ ఇచ్చిన క్లారిటీల విషయంలో పంచ్ ప్రసాద్ గురించి కూడా ప్రస్థావించారు. పంచ్ ప్రసాద్ ఎంత సంపాదిస్తున్నాడో చెప్పేశాడు. పంచ్ ప్రసాద్‌కు కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్‌లో ఉన్న సమయంలో మల్లెమాల గానీ, శ్యాం ప్రసాద్ రెడ్డి గానీ ఏ మాత్రం సాయం చేయలేదని,

కనీసం మాట సాయం కూడా చేయలేదని కిరాక్ ఆర్పీ ఆరోపించాడు. అయితే మాట సాయం కాదు.. జీవితానికి సంబంధించిన భరోసా, ఉపాధి కల్పిస్తూ పంచ్ ప్రసాద్‌కు జీవితాన్ని నిలబెట్టారంటూ ఆది, రాం ప్రసాద్ మల్లెమాలను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మల్లెమాల నుంచి దాదాపు నెలకు మూడున్నర లక్షలు సంపాదిస్తున్నాడని పంచ్ ప్రసాద్ గురించి ఆది చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన జాతి రత్నాలు ప్రోమోల్లో పంచ్ ప్రసాద్ రెచ్చిపోయాడు.

punch prasad faces bad expreince in Jathi Ratnalu promo

punch prasad faces bad expreince in Jathi Ratnalu promo

ఇందులో పంచ్ ప్రసాద్ మీదే పంచులు పడ్డాయి. అందులోంచి ఓ అమ్మాయి మరింత హద్దులు దాటేసింది. తన మీద కౌంటర్ వేయడంతో.. స్టేజ్ దిగి వచ్చాడు పంచ్ ప్రసాద్. ఏంటి.. నా మీదే కౌంటర్ వేస్తావా? అని భయపెట్టేందుకు ప్రయత్నించాడు పంచ్ ప్రసాద్. దీంతో ఆ అమ్మాయి లాగి పెట్టి ఒక్కటి ఇచ్చింది. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి పంచ్ ప్రసాద్ మాత్రం ప్రోమోకు హైలెట్ అవుతున్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది