Punch Prasad : పంచ్ ప్రసాద్ కు జబర్దస్త్ కమెడియన్స్ లో ఎవరు ఎక్కువ సాయం చేశారో తెలుసా?
Punch Prasad : జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్య గురించి అందరికీ తెలిసిందే. సుదీర్ఘ కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ రెగ్యులర్ గా అత్యంత ఖరీదైన చికిత్సను పొందుతూ ఉన్నాడు. ఆర్థికంగా బీదవాడైన పంచ్ ప్రసాద్ కి జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది డబ్బులు సాయం చేస్తూ ఆర్థికంగా చేయూతని అందిస్తున్నారు. అంతే కాకుండా మల్లెమాల వారు ఆయనకు ఎక్కువగా కార్యక్రమాలు ఇస్తూ మంచి రెమ్యూనరేషన్ అందిస్తున్నారు.
అందుకే పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కూడా నెల నెల అత్యంత ఖరీదైన చికిత్స తీసుకుంటూ కూడా నెట్టుకు రాగలుగుతున్నాడు. జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మంది పంచ్ ప్రసాద్ కి సాయం చేసిన వారిలో ఉన్నారు. వారందరిలో అత్యధిక సాయం పంచ్ ప్రసాద్ కి సుడిగాలి సుదీర్ మరియు రాంప్రసాద్ ఇంకా గెటప్ శ్రీను నుండి అందినట్లుగా తెలుస్తోంది. వీరు ముగ్గురు కలిసి దాదాపుగా 25 లక్షల రూపాయలను స్నేహితులతో కలిసి అందించారని తెలుస్తోంది.

jabardasth comedian punch prasad get financial support from team leaders
సుధీర్ చాలా మంచి మనసుతో ఇలాంటి సాయాలు చాలానే చేశాడు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు కొందరు సహాయం చేశారు. కనుక ఇప్పుడు ఆయన తనవంతు సహాయమును చేస్తూ పంచ్ ప్రసాద్ వంటి వారికి చేయూత అందిస్తున్నాడు. కేవలం పంచ్ ప్రసాద్ కి మాత్రమే కాకుండా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన వారికి కూడా సుధీర్ ఆర్థిక సాయం అందించాడు. బుల్లి తెరపై సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న సుధీర్ మనసు కూడా నిజంగా సూపర్. అందుకే సుడిగాలి సుధీర్ గ్రేట్ కదా..!