Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు అవమానం.. ఏం పీకలేరంటూ పంచ్ ప్రసాద్ అసహనం
Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కింది స్థాయి నుంచి స్టార్ వరకు సుధీర్ ఎదిగిన తీరు అసాధారణం. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే సుధీర్ మీద బుల్లితెరపై ఎలాంటి సెటైర్లు, కామెంట్లు వస్తుంటాయో అందరికీ తెలిసిందే. అందరూ కూడా సుధీర్ మీదే దారుణంగా కామెంట్లు చేస్తారు.
సుధీర్‌ను డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లతో అందరూ ఆడుకుంటూ ఉంటారు. అయితే సుధీర్ మీద సెటైర్లు వేసిన వారిని అతని ఫ్యాన్స్ ఆడుకుంటారు. అలానే ఆ మధ్య బాబా భాస్కర్ మాస్టర్‌ను దారుణంగా ఆడుకున్నారు. సుధీర్ మీద పంచులు వేసి, కించపర్చడంతో బాబా మాస్టర్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. యూట్యూబ్ వీడియోల కింద దారుణంగా ట్రోల్ చేసేవారు.

Punch Prasad Satires On Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : పంచ్ ప్రసాద్ కామెంట్లు వైరల్
ఇప్పుడు పంచ్ ప్రసాద్, జబర్దస్త్ పొట్టి నరేష్ వంటి వారు సుధీర్ మీద కించపరిచేట్టుగా సెటైర్లు వేస్తుంటారు. వారిపై సుధీర్ అభిమానులు ఫైర్ అవుతుంటారు. అయితే తాజాగా పంచ్ ప్రసాద్ సుధీర్ అభిమానులకు సవాల్ విసిరారు. నీ ఫ్యాన్స్ ఏం చేస్తారో చూస్తారు.. వాళ్లు నా విగ్ కూడా పీకలేరు.. నా కిడ్నీలు పోయినప్పుడే పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకుంటానా? అంటూ సుధీర్ అభిమానుల మీద ప్రసాద్ ఫైర్ అయ్యాడు.
