Vijay Deverakonda : చిరంజీవి, పూరీ జగన్నాథ్ కలిసి నటిస్తున్నారంటూ మేటర్ లీక్ చేసిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పీడ్ మాములుగా లేదు. వరుస పాన్ ఇండియా సినిమాలతో విరుచుకుపడుతున్నాడు. మూడేళ్ల కింద ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ పెద్ద హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత.. అనూహ్యంగా విజయ్ తో సినిమాను అనౌన్స్ చేశారు పూరి. లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.తాజాగా పూరీ -విజయ్ కాంబినేషన్లో మరో సినిమాను అనౌన్స్ చేశారు. జనగణమన అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మిలటరీ హెయిర్ కటింగ్ తో విజయ్ దేవరకొండ లుక్ ఇటీవల నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే లొకేషన్ ల రెక్కీని నిర్వహించిన టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తికరమైన ప్లేస్ ని ఫిక్స్ చేసిందట. మొదటి షడ్యుల్ కోసం ఏకంగా సౌత్ ఆఫ్రికాను ఎంపిక చేశారట పూరి.

pur jaggannadh team up with Chiranjeevi Mater leaked by Vijay Devarakonda
Vijay Deverakonda : పూరీ యాక్టింగ్..
ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ నటించే ఛాన్స్ ఉందని టాక్. తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆకాశం నుంచి ఆర్మీ టీమ్ కిందికి దూకుతున్నట్టు చూపించారు.ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ముంబైలో జరగగా, ఈ సందర్భంగా ‘చిరుతో సినిమా చేసే అవకాశం ఎందుకు మిస్సయ్యింది’ అని పూరిని అడిగితే… ఆయన దానికి కారణాల్ని చెప్పుకొచ్చారు. అయితే ఆ పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ మైకు అందుకుని.. ”పూరి త్వరలో చిరు సార్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ యాక్టింగ్ కొలిగ్స్” అంటూ ఆ సీక్రెట్ బయటకు చెప్పేశాడు. మరి పూరీ, చిరు కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందో, పూరీ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.