Macherla Niyojakavargam : నితిన్‌కి దెబ్బ మీద దెబ్బ.. అప్పుడే మాచర్ల నియోజకవర్గం ఓటీటీలోనా?
Macherla Niyojakavargam : యంగ్ హీరో నితిన్ ఇటీవలి కాలంలో మంచి హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఆ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్, శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ల మీద రాజకుమార్ ఆకెళ్ళ, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో రెండు పాత్రలలో సముద్రఖని నెగిటివ్ షేడ్స్ లో నటించి ఆకట్టుకున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Macherla Niyojakavargam : ఓటీటీకి టైం ఫిక్స్..
అయితే మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజు కార్తికేయ 2 సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ భారీగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మాచర్ల నియోజకవర్గం సినిమా కోటి రూపాయల 80 లక్షల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా కోటి రూపాయల 40 లక్షల మాత్రమే వసూలు చేసి రెండు రోజులకు గాను ఆరు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించగలిగింది. కర్ణాటక సహా మిగతా భారతదేశంలో రెండు రోజులకు కలిపి కేవలం 35 లక్షలు, ఓవర్సీస్లో కేవలం 32 లక్షలు వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల 69 లక్షల వసూళ్లు సాధించినట్లయింది
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 20 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లుగా నిర్ణయించారు. అది సాధించడం కష్టంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా రానున్న రోజులలో మంచి వసూళ్లు రాబట్టదని భావిస్తున్న నిర్మాతలు అమేజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. . సెప్టెంటబర్ 9న ఈ చిత్రం ఓటిటి లో రిలజ్ కానుందని తెలుస్తోంది. రిలీజైన నాలుగు వారాల్లో ఓటిటిలో వస్తోంది. మరి ఓటిటిలో ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.