
Puri Vijay Sethupathi : పూరీ- విజయసేతుపతి చిత్రానికి విచిత్రమైన టైటిల్..!
Puri Vijay Sethupathi ” దర్శకుడు పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ ఏడాది జూన్ చివరి వారంలో ప్రారంభం కానుంది.ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల వేటలో నిమగ్నమైందని తెలుస్తోంది.
Puri Vijay Sethupathi : పూరీ- విజయసేతుపతి చిత్రానికి విచిత్రమైన టైటిల్..!
పూరి జగన్నాథ్ తనదైన శైలిలో, ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దనున్నారు. విజయ్ సేతుపతి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. తొలి షెడ్యూల్‌లోనే విజయ్ సేతుపతితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
విజయ్ సేతుపతి – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా కోసం ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకున్నారు.. కాని ఇప్పుడు ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు . టైటిల్ మూవీ బజ్ కలిగించింది. కథకు అనుగుణంగా విజువల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న పూరి జగన్నాథ్, సాంకేతిక అంశాల్లోనూ రాజీ పడకుండా సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
This website uses cookies.